8, జనవరి 2010, శుక్రవారం

ఓ మంచి పాట

అనుపల్లవి...*... అతడు...*... రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం

ఈశ్వర అల్లా తెరో నాం సబ్ కో సన్మతి దే భగవాన్.

పల్లవి....*... అతడు...*... ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధి

ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధి 2

కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద

మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధి

భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధి

తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధి *ఇందిరమ్మ*

చ...* అతడు*... రామనామమే తలపంతా ప్రేమధామమే మనసంతా

ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత

అపురూపం ఆ చరిత

ధర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీతా

బోసినోటి తాత

మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధి

మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి

సత్య అహింసల మార్గ జ్యోతి నవ శకానికే నాంది రఘుపతిఖోరస్

2.చ...* అతడు*... గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి

దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత

సిసలైన జగజ్జేత

చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి

నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడురా జాతి పిత

సంకల్ప బలం చేత

సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి

తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి

నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి.

(సర్వజన హితం నా మతం; అంటరానితనాన్ని అంతః కలహాల్ని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం; హే రాం )

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

RAMA NAIDU చెప్పారు...

జగమంత కుటుంబం నాది - సీతారామ శాస్త్రిగారు రాసిన ఎన్నో గొప్పపాటల్లో అత్యద్భుతమైన పాట ఇది. ఈ పాట మెచ్చకుండా ఎవరైనా ఉంటారా? సాహిత్యమూ, జీవితమూ, తత్వమూ కలగలిపి ఆయన కలం లోంచి వెన్నెలలా జాలువారిన పాట. ఈ పాట వింటే చాలు ఒళ్ళంతా పులకించి పోతుంది. అంత గొప్ప పాటని మీ బ్లాగులో మరొక్కమారు చదివించినందుకు మీకు ధన్యవాదాలు.

చెప్పాలంటే...... చెప్పారు...

chalaa santoshamandi

Creative Channel చెప్పారు...

కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
ప్రతి ఉదయం నీ పిలుపే
హృదయంనే కదిలించే
మనసే పులకించే
Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner