27, జనవరి 2010, బుధవారం

మాఘ పౌర్ణిమ - పాత జ్ఞాపకాలు

మా ఊరికి దగ్గర లో సముద్రం వుంది. మాఘ పౌర్ణిమ ౩౦ జనవరి న ఈసారి. అంటే ఆ రోజు సముద్ర స్నానాలు అన్నమాట.మా చిన్నప్పుడు ముందు రోజు రాత్రే హంసలదీవి వేణుగోపాలస్వామి గుడి కి వెళ్లి ఆ రాత్రి అక్కడ భజనలు, కోలాటాలు, నాటకాలు, హరికథలు, ఇలా ఎన్నో .....ఉండేవి.... పౌర్ణమి ముందు రోజు సాయంత్రం, అప్పట్లో ఎడ్ల బండి లో ఎక్కువ గా వెళ్ళేవాళ్ళం. అందరమూ కలిసి తినడానికి పులిహోర, పెరుగు, ఇంకా తినడానికి చాలా రకాలు పండుగ వంటలు ఉంటాయి గా అవి అన్ని తేసుకు వెళ్ళేవాళ్ళం. దేముడి దర్శనం చేసుకుని పెద్ద వాళ్ళు భజనల దగ్గర వుంటే పిల్లలము కోలాటాల దగ్గరకి నాటకాల దగ్గరకి వెళ్ళేవాళ్ళం. తెల్లవారు ఝామున గుడి దగ్గర నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తరువాత కాలినడకన ౨, ౩ మైళ్ళు నడిచి సముద్రం దగ్గరకు చేరేవాళ్ళం. పొద్దు పొడుస్తూ ఉన్నప్పుడు సముద్రస్నానాలు చేసే వాళ్ళం. ఇక అవి అయిన తరువాత మళ్ళి గుడి దగ్గరకు వచ్చి దేముడి దర్శనం చేసుకుని షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేసి ఇక ఇళ్ళకు బయలుదేరతారు. చెప్తుంటే ఇంతేనా అనిపిస్తుంది, కాని ఆ రోజులు భలే ఉండేవి ఆ అనుభూతులు మరల మరల కావాలి అన్నా రావు, ఇలా గుర్తు చేసుకోడం తప్ప ఇంక ఏమి చేయలేము కదా!!2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Dear Freind
i saw ur blogg it is very nice realy i too love to spend in POORNIMA days in Moon light but it is Un Fortuante iam in USA/Bosten now here climate is Minus 12 to 15 * we canot go out in day timer also

any how it is very nice seeing ur article God bless u to write many many arcticles pl Reply
Thanking u
with warm readgs
Surednra reddy
America / Bosten
My id surendrareddyv@gmail.com

అజ్ఞాత చెప్పారు...

Thank you very much Surendra garu....

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner