8, జనవరి 2010, శుక్రవారం

నాకు నచ్చిన పాట

పల్లవి......* అతడు....* జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది 2
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే *జగమంత*.
చ...* అతడు*...* కవినై…. కవితనై….. భార్యనై…. భర్తనై 2
మల్లెల దారిలో… మంచు ఎడారిలో 2
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం
కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని, రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని *జగమంత*.
చ...* అతడు..*..* మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై 2
మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ..
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని, చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని *జగమంత*.
చ....* అతడు...*...* గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగివెడలె గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి *జగమంత*..

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ఈ పాట చూస్తూ వున్నా వింటూ వున్నా నాకే బాగా సరిపొతుందా అన్నట్లు వుంటుంది ఎవరికైనా....సిరి వెన్నెల గారి సాహిత్యం అంత బాగుంటుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner