5, జనవరి 2010, మంగళవారం

విన్నపము

పసి పాపలను వదిలేసే అమ్మలకు విన్నపము
అమ్మ అంటే అమృత హృదయం దయచేసి అమ్మతనానికి అన్యాయం చేయకండి. మీ ఇబ్బంది ఏదైనా సరే కనీసం కుప్ప తొట్టి లో కాకుండా ఏ అనాధశరణాలయం దగ్గర అన్నా వదిలేయండి.
అంతే కానీ జంతువులకు ఆహారం గా వేయవద్దు.
ఈ సృష్టి లో ఏ మచ్చ లేనిది అమ్మతనం దానిని మలినం చేయకండి.
ఏ పాపం తెలియని పసికందులని కుక్కలకు, పందులకు ఆహారం గా వదలకుండా మీరు చేసిన తప్పులకు వారిని
బలి చేయకండి. దయ చేసి వాళ్ళకు బతికే అవకాశం ఇవ్వండి.
అమ్మలూ అలోచిచండి ఒక్కసారి..........
పసి పాపల బోసి నవ్వులు చూసే అదృష్టం మీకు లేక పొతే
చిన్నారుల ఆటపాటల ఆనందాలు అస్వాదించే అమృత హృదయం మీది కాకపోతే
ఆదుకునే ఆనంద నిలయాల దగ్గర వదిలేయండి కానీ ..... మాతృత్వాన్ని మరిచి పోకండి అనుకోకుండా అమ్మలైన ఓ అమ్మలూ....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner