29, సెప్టెంబర్ 2010, బుధవారం

మధురానుభూతుల బాల్యం....

చిన్నప్పటి జ్ఞాపకాలంటే....మరల రాని మరపు రాని....మధురానుభూతులు...
స్కూలు ఎగ్గొట్టి చుట్టుపక్కల వాళ్లకి కబుర్లు చెప్పి గులాబీలు తెచ్చుకోవడం జ్ఞాపకమే...
అమ్మమ్మ తిడితే పుస్తకంలో రాసి అమ్మకు చూపటం జ్ఞాపకమే...
బొమ్మలాటలు...టీచరులా బెత్తం చాక్పీసులతో ఆడిన ఆటలు జ్ఞాపకమే...
బాదం కాయల వేటలు...పారిజాతాల దండలు గుచ్చడం జ్ఞాపకమే...
చెరువులో....కాలువల్లో....కొట్టిన ఈతలు జ్ఞాపకమే...
అమ్మానాన్న ఆటలు....చేసిన సత్యన్నారాయణ వ్రతాలు....పంచిన ప్రసాదాలు... జ్ఞాపకమే...
పాడిన పాటలు...చదివిన కథల పుస్తకాలు...తిన్న తిట్లు...అన్ని... జ్ఞాపకమే...
స్నేహితులతో గిల్లికజ్జాలు...చూసిన సినిమాలు...వేసిన బొమ్మలు... జ్ఞాపకమే...
మాస్టారితో తిన్న తన్నులు....చెప్పిన పాఠాలు...చేసిన అల్లరి...జ్ఞాపకమే...
వన భోజనాలు...వార్షికోత్సవాలు... జ్ఞాపకమే...
ఉత్తరాల్లో పంచుకున్న పెంచుకున్న అనుభూతుల అనుబంధాలూ... జ్ఞాపకమే...
అప్పటి ప్రతి క్షణం ఇప్పటికీ.....ఓ మధుర జ్ఞాపకమే...

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

పరిమళం చెప్పారు...

జ్ఞాపకాలు...ఎప్పటికీ మధురమే!రాజా సినిమాలో పాట గుర్తుకొచ్చిందండీ

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు ఎంతో ఇష్టం ఆ పాట.....తిపైనా చేదైనా జ్ఞాపకం మధురమే కదండి.....థాంక్ యు నచ్చినందుకు

భాను చెప్పారు...

జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి. మీజ్ఞాపకాలు కుడా అలాగే ఎంతో మధురంగా ఉన్నాయి

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు...... థాంక్యు ....భానుగారు...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ మధుర జ్ఞాపకాలు చాలా మధురంగా వున్నాయండీ...

చెప్పాలంటే...... చెప్పారు...

చదివి మధురమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు....రాజి గారు..

absentminded చెప్పారు...

ade ballo nenu chaduvukunnanu.mari neenu gnapakamena?

చెప్పాలంటే...... చెప్పారు...

ఎందుకు జ్ఞాపకం లేరు?? ఎప్పుడూ క్లాసులో ప్రధముడు మీరే కదా!!

, చెప్పారు...

sorry, ee memories ila gurtukoccayi..
-------------------------------------


http://sridharchandupatla.blogspot.com/2008/12/blog-post.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner