20, అక్టోబర్ 2010, బుధవారం

అవసరానికి మాత్రమే అన్నీ....

ఇప్పటి రోజులలో బంధాలు-అనుబంధాలు, ప్రేమ-ఆప్యాయతలు అన్నీ అవసరం చుట్టూనో లేదా అందరిని శాసించే డబ్బు- అధికారం చుట్టూనో తిరుగుతున్నాయని మన అందరికి తెలిసిన జగమెరిగిన కాదనలేని నిజం.
ఇల్లు, ఆఫీసు ఏదైనా కానియండి అవసరానికి తేడా లేదు. ఎదుటి వాడితో పని లేనప్పుడు అస్సలు వాడెవడో మనకు తెలియదు, అదే మనకు వాడితో పని ఉందనుకోండి వాడే కాకుండా వాడి స్నేహితులు, చుట్టాలు అందరు మనకు బాగా తెలిసిన వాళ్ళు అవుతారు ఆ క్షణంలో.... కాదంటారా!! ఇదే సిద్ధాంతాన్ని మనపై ఎదుటి వాడు కుడా ఉపయోగిస్తే మనం ఎలా అనుకుంటామో, ఎంత బాధ పడతామో ఓ క్షణం ఆలోచిస్తే అప్పుడైనా కొద్దిగా మన ఆలోచనల్లో, అలవాట్లలో, పద్దతుల్లో కొద్దిగానైనా మార్పు అనేది వస్తుందేమో అని చిన్ని ఆశ. అవసరం అనేది ఎప్పుడైనా ఎవరితోనైనా రావచ్చు. ఇది ఎంతటివారికైనా తప్పనిది. ఇల్లు ఇంటికి ఎంత దూరమో ఇల్లు ఇంటికి అంతే దూరం కదా!! మనం ఇబ్బందిలో ఉన్నప్పుడే ఓదార్చే మనసు కాని మనిషి కాని కావాలి.....అది డబ్బుతోనో అధికారంతోనో రాదు. మన నోటి మంచితనం కానివ్వండి, జాలికానివ్వండి మరికేందైనా కానివ్వండి అప్పటి పరిస్థితికి మనోధైర్యాన్ని ఇవ్వగలిగే మాట సాయం లేదా నీకు నేనున్నాను అని చెప్పే స్వాంతన , ధైర్యం ఎంతో విలువైనవి...ఆ ఆలంబనని దూరం చేసుకోకండి. దూరం చేసుకుంటే మీకన్నా ఈ ప్రపంచం లో దురదృష్టవంతుడు వుండడు. ఎవరైనా ఈ టపా మూలంగా బాధ పడితే క్షమించగలరు....

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడున్నవన్నీ అనుబంధాలు కావండి, ఎవరో చెప్పినట్టు మనీ బంధాలు. ఎంతసేపు పక్క వారితో మాట్లాదితే మనకు ఎంత అవసరపడతారు అన్న గొడవే తప్ప మనసు విప్పి మట్లాడే వాల్లు చాల తక్కువ. ఎంతసేపు మనం ఎలా సంపాదించాలి అన్న గొడవే.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాల నిజమండి..

thinking brain చెప్పారు...

meeru deenini evarini vuddesinchi rasaro naku telidu kani correct ga chepparu.ee madye ekkado chadivanu.sudi chese pani enugu cheyaledani.nenaite nakevaru telidu, naku nenuga ee pani cheskolena ane angle lo alochistanu.naku telsina vallato naku pani vunna anta telligga vallani adaganu.andarito eppudu relation maintain cheyyatam kastam kada?ee busy life lo?

చెప్పాలంటే...... చెప్పారు...

మనసుంటే మార్గం వుంటుంది. బంధాలకి అనుబందాలకి కుడా బిజీ లైఫ్ అనుకుంటే ఎలా? అడగక పొతే అమ్మ కుడా అన్నం పెట్టదు అన్నది కుడా తెలిసే వుండాలి మీకు, తప్పనప్పుడు అడగటం లో తప్పు లేదు.....అని నేను అనుకుంటాను కొన్ని కొన్ని మాత్రమే చేసుకోగలం అన్ని చేసుకోలేము కదా!!!
ఇది నాకనిపించినది మాత్రమే తప్పు గా అనుకోకండి...

thinking brain చెప్పారు...

endulo tappemundi? amma pettaka poyina parledu ankune manastatvam kuda kondriki vuntundi...

చెప్పాలంటే...... చెప్పారు...

అమ్మ పెట్టక పొతే ఏమి అనుకోము కాని అడక్కుండా ఏది రాదు అని.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner