25, అక్టోబర్ 2010, సోమవారం

రక్తచరిత్ర సినిమా

మొన్న శనివారం మధ్యానం రక్తచరిత్ర సినిమా చూసాను. నాకైతే....చాలా బాగా తీసారు రాంగోపాల్ వర్మ, మళ్ళి పాత వర్మ ని చూసినట్లు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సినిమాకు ప్రాణం పోసింది. ఫోటోగ్రఫి కుడా ఎంతో బాగుంది. కాకపొతే ఒక్క వాయిస్ఓవర్ మాత్రం అంత బాగా అనిపించలేదు. పాత్రల నుంచి తనకు ఏ రకమైన నటన కావాలో దానిని రాబట్టుకోవడం లో వర్మ నూరు శాతం గెలిచారు.
అనాది నుంచి వస్తున్న కారణమే " చెప్పుడు మాటలు" విని మంచిని, మేలుకోరేవారిని కాదనడం, మారణహోమాలకు, రక్తపాతాలకు కారణమని మొదట్లోనే చెప్పడం దానిమీదే సినిమా మొత్తం చూపించడం స్క్రీన్ప్లే చక్కగా కుదిరింది. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ గా చూపించడం కాకుండా చాలా వరకు వాస్తవ సంఘటనలకు రూపమే అనిపించింది. యదార్ధాన్ని దృశ్యరూపంగా చూపించాలంటే కష్టం. ఎంతో కొంత కల్పన తప్పదు. పగ ప్రతీకారాలు కాకుండా వాటికి మూలం ఏంటని ఓ క్షణం ఆలోచిస్తే...రక్తపాతాలు ఎందుకు జరుగుతున్నాయని తేటతెల్లం గా తెలుస్తుంది.
చెప్పుడు మాటలు వినండి కాని నిజాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. అమాయకుల ప్రాణాలతో ఆడుకోకండి....
వర్మగారిని మాత్రం రక్తచరిత్ర విష్యంలో మెచ్చుకోక తప్పదు....అభినందనలు రాంగోపాల్ వర్మ గారు.

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

ఆ సినిమా గురించి మీ వర్ణన చాల బాగుంది..మంచి మాటలు కూడ చెప్పారండి.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు అండి..నచ్చినందుకు

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు విజయనగరంలో ఎన్నాళ్ళున్నారు?

చెప్పాలంటే...... చెప్పారు...

7 years.

చెప్పాలంటే...... చెప్పారు...

ఎందుకడిగారు సౌమ్యా!! విజయనగరం లోఎన్నాళ్ళున్నామని ?

ఆ.సౌమ్య చెప్పారు...

ఓహ్ అవునా, మీ సొంత ఊరు విజయనగరమేనా?ఏంలేదు మాదీ విజనగరమే...అందుకని అడిగాను. :)

అజ్ఞాత చెప్పారు...

మీది తెనాలే ..అరె . మాది తెనాలె మీది తెనాలే ..అరె . మాది తెనాలె మీది తెనాలే ..అరె . మాది తెనాలె మీది తెనాలే ..అరె . మాది తెనాలె మీది తెనాలే ..అరె . మాది తెనాలె మీది తెనాలే ..అరె . మాది తెనాలె

అజ్ఞాత చెప్పారు...

ఓహ్, మీది ఇజ్జినారమా, మాదీ అక్కడ దగ్గర్లొనే :)

చెప్పాలంటే...... చెప్పారు...

ఇలా రాస్తే మీకు సంతోషం ఐతే సరే అలాగే కానియ్యండి -:) మీ ఆనందాన్ని మేమెందుకు కాదనాలి....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner