2, నవంబర్ 2010, మంగళవారం

సడిచేయకో గాలి.....

రాజమకుటం లోని ఈ పాట పి. లీల గారి గళం నుంచి జాలువారిన ఆణిముత్యాలలోని ఓ మరపు రాని అద్భుతమైన పాట. మాస్టర్ వేణు గారు సంగీతమందించిన అందరి మనసులు దోచిన పాట. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి నిలిచి వుండే మధుర గీతాలలో నాకిష్టమైన ఈ పాట మీకోసం......"బడలిక ఒడిలో అలసి సేదదీరుతున్న రారాజుకి లాలి పాట... "
చూడాలంటే ఈ లింక్ నొక్కండి

http://www.youtube.com/watch?v=ljBKuXCKl1s


సడిచేయకో గాలి సడిచేయబోకే
సడిచేయకో గాలి సడిచేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే * సడిచేయకో గాలి *
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే * సడిచేయకో గాలి *
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే * సడిచేయకో గాలి *
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే * సడిచేయకో గాలి *

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Naaku chaala istamayina patalalo idi okati. B.N. Reddy garu Mastaer Venu nunchi yentha manchi sangeetham rabattaro! Devulapalli lyrics are excellent.

Thanks for your post.

అశోక్ పాపాయి చెప్పారు...

పాట అయినా పద్యమైనా కథ అయినా సంగీతమైనా దానికొక గొప్ప చరిత్ర ప్రత్యేకత కళాత్మక విలువలు ఉంటాయి.కళాఖండాలలాంటి సినిమాలలో ప్రసిద్ధి పొందిన అంశాలలో ఈ విలువలు మరింత ఎక్కువ.ఎందుకనంటే ఒక దేవదాసు సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఎంతమంది నిర్మాతలు మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు ఆ సినిమాను తీసినా అంత బాగా రాదు. ఆ సినిమాను చూసిన కళ్లతో చూసిన అలాంటి మరో సినిమా ప్రేక్షకులకు నచ్చదు. పాట విషయంలోనూ అంతే! ఆపాత మధురాలుగానో... మంచి హుషారైన పాటలుగానో శ్రోతల మన్ననలందిన ఆనాటి పాటలు ఈనాటికీ వాళ్ల గుండె లాకర్లో ఓ మధురానుభూతిగా భద్రంగా ఉండిపోతాయి..అలగే మీరు కూడ ఇప్పుడు ఓ మంచి పాటను అందించి మమ్మల్ని సంతోషపరిచారు...చాల బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషమండి ఓపిక గా ఇంత మంచి వ్యాఖ్యానం రాసినందుకు
పాట నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner