
అమ్మాయి బాగుంది.... అందం గా నవ్వింది....
కబుర్లెన్నో చెప్పింది....ఆశలెన్నో రేపింది....
కలలెన్నో కన్నాను కలిసి ఉందామని.....
మనసులో మాట చెప్తే కాదు..!! పొమ్మంది...!!!
అందాల బొమ్మా!! నీ మనసెందుకమ్మా ఇంత కఠినం!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది
పాటలు నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

నా దగ్గర వున్న పుస్తకం లో నుంచి...మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......