15, ఏప్రిల్ 2011, శుక్రవారం

కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే...!!!

ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నఅందరము ఓ ముప్పై ఏళ్ల తరువాత తిరిగి మేము చదువుకున్న స్కూలు లోనే కలుద్దామని గత సంవత్సర కాలంగా అనుకుంటున్నాము. మొన్నీమద్య కాస్త కార్య రూపం దాల్చింది అది. నిన్న కార్యాచరణ లోకి వచ్చింది. నిన్న లంకమ్మ వారి తిరుణాల సందర్భంగా పదిహేను మంది కలిసారు. వచ్చే నెల పదిహేనున అందరూ కలవాలని.....దానికి ప్లానింగ్ కోసం నిన్న మాట్లాడారు....
ఇన్ని సంవత్సరాల తరువాత అప్పటి రోజుల గురించి, అప్పటి నేస్తాలను కలవడం, ఆనాటి కబుర్లు, ఆటలు, పాటలు, అల్లరి....ఇలా ఎన్నో మరపురాని మధురానుభూతులు మళ్ళి ఒక్కసారి చిన్నప్పటి రోజులు వచ్చినట్లు వుంటుంది కదూ..!!
ఎలాను మళ్ళి మనం చిన్నవాళ్ళం అవలేం కదా....అందుకని అలా ఒక్కసారి అందరూ కలిస్తే మళ్ళి ఆ రోజులు తిరిగి వచ్చినట్లు అనిపించక పోదు!! కాలాన్ని వెనక్కి తేలేం కాని గతంలోకి వెళ్ళగలం కదా!! అందుకే అందరూ మర్చిపోకుండా రావాలని....వస్తారని.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner