25, ఏప్రిల్ 2011, సోమవారం

ఎందుకో తెలియదు.....??

నువ్వంటే ఇష్టం...ఎందుకో తెలియదు
మరి నేనంటే నీకిష్టమో కాదో...!!
మన మధ్య మాటల్లేవు, కబుర్లు లేవు
ఊసులు చెప్పుకున్న దాఖలాలు లేవు
ఊహలు పంచుకున్న రోజులూ లేవు
కలిసి తిరిగిన చోటూ లేదు, చేసుకున్న బాసలూ లేవు
కలిసి ఉండాలన్నంత అనుబంధమూ లేదు
అలా అని కలవలేనంత దూరమూ లేదు
విడిపోలేనంత ఆపేక్షలు లేవు విడదీయరాని బంధమూ లేదు
వదిలి పోయేంత శత్రుత్వము లేదు
చూడకుండా ఉండలేనంత సాన్నిహిత్యము లేదు
చూడాలన్నంత దగ్గరతనమూ లేదు...మన మధ్య
అయినా నువ్వంటే ఇష్టం... మరి నీకు??

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

బావుంది.నైస్ ఫీలింగ్

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు

శిశిర చెప్పారు...

బాగుందండి.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు శిశిర....ఏంటి కనిపించడం లేదు ఈ మధ్య

శివ చెరువు చెప్పారు...

well written..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శివ గారు

Sridhar చెప్పారు...

కలిసి ఉండాలన్నంత అనుబంధమూ లేదు
అలా అని కలవలేనంత దూరమూ లేదు
విడిపోలేనంత ఆపేక్షలు లేవు విడదీయరాని బంధమూ లేదు,వదిలి పోయేంత శత్రుత్వము లేదు
చూడకుండా ఉండలేనంత సాన్నిహిత్యము లేదు
చూడాలన్నంత దగ్గరతనమూ లేదు...మన మధ్య
అయినా నువ్వంటే ఇష్టం!! మరి నీకు??

intakante proof emi ledu.
Amazing...

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు థాంక్యు...దేనికి సాక్ష్యం ఇది?

Sridhar చెప్పారు...

proof denikante chaala rojula taruvata blogs lo inta manci kavitvam cusinanduku. baaga raasevaallu vunnaranna proof.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజం గా చాలా సంతోషం గా వుంది మీ కామెంట్ చూసి థాంక్యు శ్రీధర్ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner