22, ఏప్రిల్ 2011, శుక్రవారం

కలలోనైనా....

కరిగిపోయే కలలో నీ రూపం కనుమరుగౌతుందేమో అని
కమ్మని కలలోనే ఉందామంటే అది కలత నిదురైంది
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ కోసమే నా బ్రతుకని నీకెలా చెప్పేది..
నా గుండెల నిండుగా నువ్వే...నా ఊపిరి నువ్వే...
నా కలా...కోరికా నువ్వే...నా గతం...వర్తమానం నువ్వే...
నీకు దూరంగా వున్నా...దగ్గరగా లేకున్నా...నీ ధ్యాసే నిరంతరం!!
ప్రేమగా కబుర్లు చెప్పలేను...ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేను...
నీ ఉన్నతి కోసం నీ ముద్దుమురిపాలకు దూరంగా...
సుదూర తీరాలలో ఉన్నా అనుక్షణం నీ ఆలోచనలే...
నువ్వనుకుంటావు నీ మీద ప్రేమ లేదని....
ఎలా చెప్పను?? నువ్వంటే చెప్పలేనంత ఇష్టమని...
నువ్వే నా జీవితమని నీ కోసమే నా ఉనికని...
ఏమి చెప్పి నమ్మించను నిన్ను??
(పిల్లలకు దూరంగా వున్న తల్లులు....)

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

అమ్మ మనసు చాలా బాగా చెప్పారు

classmate చెప్పారు...

meeru america lo vunnappati feelings rasinatlundi...

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అలానే అనుకోండి అదే నేను రాసింది కుడా .....థాంక్యు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner