8, జూన్ 2011, బుధవారం

కల్పన నిజమైతే...!!

ఎప్పుడో దూరమైనా...నీ గురించిన తలపులే అనుక్షణం
నువ్వెక్కడ కనిపిస్తావా అని వెదుకులాటే నిరంతరం
నీకు ఒక్క సారైనా అనిపించిందా... 
నీకోసమే పరితపిస్తున్నానని...
అడుగులు ఎటు పడుతున్నా
 నీ దర్శనం అవుతుందేమో అని....
ఎంతమందిలోనైనా నువ్వు కనిపిస్తావేమో
అని ఆశగా చూసే కళ్ళకి....
నీ రూపం అపురూపంగా కనిపించి
ఈ నిరీక్షణ ఫలించి కల్పన నిజమైతే !!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

నేస్తం చెప్పారు...

మీ కవితలు చదువుతూ ఉంటాను..చాలా బాగుంటాయి... నాకిలా చిన్న సులువైన పదాలా కవితలు నచ్చుతాయి

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు చాలా ఆనందంగా వుంది నేస్తం గారు మీరు కుడా నా కవితలు చదువుతున్నందుకు.... మీ కాంప్లిమెంట్స్ కి బోల్డు ధన్యవాదాలు...

లత చెప్పారు...

సింపుల్ గా క్యూట్ గా ఉంది

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner