27, జూన్ 2011, సోమవారం

డబ్బు,అధికార దాహం...ఎంత వరకు??

రాయలసీమలో ఫ్యాక్షనిజం నాటుబాంబులు తుపాకులతో జరుగుతుంటే....ఏనాడో మర్చిపోయిన కత్తుల, కొడవళ్ళ హత్యోదంతాలు మళ్ళి కృష్ణాజిల్లా దివితాలుకాలో భయోత్పాతాలు సృష్టిస్తున్నాయి.
ఈ మద్య తరచుగా మనం విన్న అన్ని హత్యలు పక్కనే వున్న నమ్మకమైన అనుచరగణం చేతిలోనే డబ్బు జబ్బు పట్టి న మానవ మృగాలకే సాధ్యమైంది. ఆనాటి చరిత్ర తీసుకున్నా ఇదే ఈనాటి చరిత్ర చూసినా ఒక్కటే కారణం డబ్బు, అధికారం కోసమే జరుగుతున్నాయి ఈ హత్యారాజకీయాలు అన్ని....ఆనాడు ఝాన్సిలక్ష్మిబాయి, అల్లురిసీతారామరాజు, మహాత్మాగాంధి, ఇందిరాగాంధి.. ఈనాడు పరిటాలరవి, మద్దెలచెరువు సూరి, చలసాని పండు, తాతినేని రామకృష్ణ( బలరాం) వరకు అందరూ నమ్మకంగా తమతో వున్న వారి చేతులలోనే బలికావడం నిజంగా శోచనీయం. మానవ విలువలపై నమ్మకాన్ని కోల్పోతున్న క్షణాలు మరింతగా కలవర పరుస్తున్నాయి....ఎవరిని కదిలించినా గుండెలు పిండే నిజాలు వినిపిస్తున్నాయి.
అతి చిన్న వయసులో తన కళ్ళెదుటే అన్నం పళ్ళెం దగ్గర కూర్చున్న నాన్నని ప్రత్యర్ధులు కొట్టుకుంటూ లాకెళ్ళి చంపితే ఆడి పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని పగతో, ప్రతీకారంతో నింపుకున్న ఆ పసివాడి తనువు రగిలిపొకుండా ఉంటుందా!! ఏం చేసినా ఆ ముక్కుపచ్చలారని బాల్యాన్ని తిరిగి ఇవ్వగలమా!! అందరికన్నా చిన్నవాడయినా అన్ని తానే అయినా...చిన్నప్పటి కసిని తనతోనే పెంచుకున్నా, ఎన్నో మరణాల తరువాత ఇరుపక్షాలు వారి వారి హితులను సన్నిహితులను కోల్పోయిన తరువాత రాజి పడి తమ ఊరిని ఎంతో ఉన్నతంగా అందరికి ఆదర్శ ప్రాయంగా తిర్చిదిద్దుకున్నారు. కాలక్రమంలో ఇరువర్గాలు రాజకీయాల పరంగా వేరైనా అందరూ ప్రశాంతంగా వున్నట్లు వున్నారు మొన్నటి బలరాం హత్యోదంతం జరిగే వరకు.....ఎన్నో భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి కాని మూలకారణం డబ్బు, అధికారం కోసమే జరిగినట్లు నమ్మక తప్పదు.
స్క్రిప్టు ఓ పోలీస్ అధికారిది అయితే డబ్బు ఎర చూపి హత్యను జరిపించింది కొందరు బడా బాబులు. హత్య చేసిన వాడికి దొరికి పొతే ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అని మొత్తం కధ, మాటలు, దర్సకత్వం పొలిసు అధికారిది, కొంత మంది నాయకుల అండ తో వున్న వారిది....తమకో జీవితాన్ని ఇచ్చి, తమ గూడేనికి ఎన్నో మంచి పనులు చేసిన మనిషిని, తన పెళ్ళాం పురిటికి, తరువాత ఇంట్లో శుభకార్యానికి డబ్బులు ఇస్తే వాడే కాలయముడై కాటేసాడు. ఇప్పటి వరకు ఆ ఊరిలో జరిగిన హత్యలలో అందరూ రెండు వర్గాలలోని వారే కాని గుడెపు వాళ్ళు కాదు మహా అయితే ఒక్కరో ఇద్దరో పొరపాటుగా చనిపోయి వుంటారు. అందరి దగ్గరా డబ్బులు తింటూ నమ్మకంగా వున్నట్లు నటిస్తూ ఇలా గొంతులు కోస్తున్నారు ఆ నరరూప రాక్షసులు...పెట్టి పోషించే వాళ్ళు వున్నంతకాలం ఇలా నమ్మక ద్రోహం చేస్తూనే వుంటారు..... తనకంటూ ఏమి ఉంచుకోకుండా, తన కుటుంబాన్ని అర్ధాంతరంగా అన్యాయం చేసి వెళ్ళి పోయిన బలరాం జీవితం ఎంత మందికి కనువిప్పు అవుతుంది? ఎప్పటినుంచో పాతుకు పోయిన పార్టీని నామరుపాల్లేని పార్టీగా చేసి కొత్త ఉరవడిని సృష్టించి గెలుపు బావుటా ఎగురవేసి తన ఊరిని ప్రగతి పదంలో ముందుకు నడిపించి అందరి మన్ననలు చూరగొన్న బలరాం ఈనాడు తనను వెన్నంటి నమ్మకంగా వున్న నమ్మకస్తుల చేతిలోనే హతమవ్వడం అందరికి తీరని లోటు.....
ఇప్పుడు చంపడానికి పెద్దగా ఎవరు కష్టపడనక్కర లేదు డబ్బులు వుంటే చాలు చాలా సింపుల్ గా స్పాట్ పెట్టించేయోచ్చు.......

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Rajendra Devarapalli చెప్పారు...

చాలా దారుణం.యింతకీ ఎవరీ బలరాం?దివితాలూకాలో యేవూళ్ళో జరిగిందీ ఘాతుకం?గూడెం వారంటే ఎవరు?కిరాయి హంతకులా?
చాన్నాళ్ళ క్రితం ఒకసారి అవనిగడ్ద వచ్చాను.అంతకు ముందురోజే ఒక లాయర్ని పోలీస్ స్టేషన్ కు కోర్టుకు మధ్యలో చంపారని ఊరంతా గోలగోల గా ఉంది.ఇంకా అక్కడి హత్యాకాండ తగ్గలేదన్నమాట?

చెప్పాలంటే...... చెప్పారు...

వక్కలగడ్డలో జరిగింది....అవును అప్పుడు తూమాటి రంగనాద్ అని లాయర్ నీ పట్టపగలే చమేసారు పోలిస్ స్టేషన్ ఎదురుగానే

vijay చెప్పారు...

"పాముల్ని ఆడించేవాడు పాము కాటుకే గురైతాడు"
అనే నానుడి మీకు తెలుసా

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ పాము కుడా మళ్ళి పాములవాడికే దొరుకుతుందిలెండి....

vijay చెప్పారు...

దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది

చెప్పాలంటే...... చెప్పారు...

కదా మరి ...:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner