5, జులై 2011, మంగళవారం

రాజీనామాలా...!!!!

జనానికి పంగనామాలా...!! లేక రాజీనామాలా..!! ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తారు? ఎన్ని సార్లు ఎన్నికలలో పోటి చేస్తారు? రాజకీయపు రాక్షస ఆటలో బలిపశువులు ఎందఱో.....?? సామాన్యుని జీవితంలో రోజు రోజుకి పెరుగుతున్న పన్నుల భారం...నిత్య జీవిత కృత్యమై పోయింది. ఏ పన్ను భారం ఎప్పుడూ పడుతుందో తెలియదు....ఏ బంద్ ఎప్పుడూ మొదలవుతుందో ఎరుక లేదు....పండిన పంటకు సగటు ధర లేదు, నిత్యావసరాలు నీలాకాశంలో చుక్కల్లా అందకుండా ఊరిస్తున్నాయి....నాయకుల వాగ్ధానాలు ఎడారి ఒయాసిస్సులను తలపిస్తుంటే మింగమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం... చందాన ఎప్పుడూ ఏమౌతుందో తెలియని అయోమయం లో పడవేసిన అమ్మగారు మరి ఏ పరిష్కారం చూపుతారో వేచి చూద్దాం..!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Krishna చెప్పారు...

అమ్మ గారు ఇప్పుడు కేరళ ఆలయ సంపదపై కన్నేసినట్టున్నారు. మరి ఈ విషయం తేల్చడానికి సమయం ఉందో లేదో వారికి

అజ్ఞాత చెప్పారు...

to hell with t idiots. the idiots who resign their posts should be banned from contesting again for 10 years. bloody fellows have ruined the peaceful andhra pradesh state.

Jai చెప్పారు...

@Anonymous:

Go ahead and ban the "idiots". The seats will go vacant as no one will contest. Your "peaceful" andhera pradesh will have only your andhera M:A's. What a great example of democracy!

మాలా కుమార్ చెప్పారు...

నిజమేనండి అవి పెద్ద పెద్ద పంగనామాలు . వాళ్ళకు సిగ్గులేదు , మనకు గతిలేదు .

Sravya V చెప్పారు...

హ్మ్ !

Rao S Lakkaraju చెప్పారు...

రిజైన్ చేసిన వాళ్ళ ఖాళీ సీట్లల్లో,మళ్ళా జనరల్ ఎన్నికలు వచ్చేదాకా, CM ఎవర్నన్నా అప్పాయింటు చెయ్యచ్చు అని constitution మారిస్తే ఈ ప్రోబ్లం ఉండదు. అమెరికా లో కొన్ని రాష్ట్రాలలో ఇలాగే ఉంది. అందుకని ఎవ్వరూ రిజైన్ చెయ్యరు.

vijay చెప్పారు...

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల దొలగబెట్టు
చెప్పుదినెడి కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ

ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపె కాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో అండి ఈ రాజీనామాలకు అంతం చుస్తే మళ్ళి రాజీనామాలు అనేవి లేకుండా చేస్తే కాని ఈ పద్దతి మానుకోరు మన రాజకీయనాయకులు....ఎన్నికల డబ్బు మనదే ఎన్ని సార్లు ఎన్నికలు వచ్చినా నష్టం మనకే ఒక సారి రాజీనామా చేసిన వారికి మళ్ళి ఎన్నికలలో పాల్గొనే అర్హత లేకుండా చేస్తే .....!!
అందరికి పేరు పేరునా ధన్యవాదాలు నా టపాకి మీ స్పందనలు తెలిపినందుకు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner