2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అపాత్రదానం..!!

ఏదైనా చేయాలంటే కాస్త భయంగానే ఉంటోంది...ఎందుకంటారా!! చెప్పేస్తున్నా  ఫాలో అయిపోండి మరి...
మా ట్రస్టు తరపున అమ్మానాన్న లేని ఒక అబ్బాయిని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాము గత నాలుగు ఏళ్లుగా....మొన్నీమద్య ఒకసారి ఫ్రెండ్ సిస్టర్ పెళ్లికి వచ్చి ఇంటికి వస్తే ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బులు కాకుండా చిన్న మొత్తమే అనుకోండి ఓ ఐదు వందలు ఇచ్చి పంపాను. క్రిందటి నెలలో ఇంటికి వచ్చి మళ్ళి ఇంకో ఇయర్ డబ్బులు కావాలి అని అడిగాడు. కాంపస్ సెలక్షన్స్ లో జాబ్ రాలేదా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం... వచ్చినది కాదనుకున్నాడంట. ఎన్ని ఇయర్స్ డబ్బులు తీసుకున్నాడో కూడా గుర్తు లేని ఆ అబ్బాయికి అపాత్ర దానం చేసామేమో అని అనిపించింది. ఇంజనీరింగ్ అయిపోయి కుడా ఇంకా డబ్బులు అడగడానికి మరి ఏమి అనిపించలేదో లేక మాకు ఊరికినే డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకొవాలో తెలియక ఇస్తున్నాము అనుకుంటున్నాడో అర్ధం కాలేదు....ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి కి ఇంజనీరింగ్ లోనే డబ్బులు ఇస్తే లాప్ టాప్ కొనుక్కోవాలి ఇరవై వేలు ఇవ్వండి అంది....మొదటి ఇయర్ అయ్యి రెండో ఇయర్ కి రాగానే....మనమేమో ఒకరు అయినా బావుంటారు అని మనకు వున్న దానిలోనే వాళ్లకు ఇస్తూ వుంటే వీళ్ళు ఇలా వున్నారు....జనాలు ఇలా వున్నంత కాలం స్విస్స్ బాంక్ ఎకౌంట్లు కాని ఇంకా ఏమైనా పెద్దవి వుంటే అవి కూడా చాలవు...ఊరికినే డబ్బులు కష్టపడకుండా రావాలంటే ఎలా కుదురుతుంది....?? ఇవ్వడం తీసుకోవడం తప్పు కాదు...ఇదిగో ఇలాంటివి కాకుండా వుండాలి......ఇచ్చే ముందు ఓసారి అలోచించి ఇవ్వండి....-:)

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Praveen Mandangi చెప్పారు...

అపాత్ర దానం కాదు కానీ నేను చేసిన దానం ఒక వ్యక్తి కంటి చూపుని రిస్క్‌లో పడేసింది. నా ఆఫీస్ వెనుక ఉన్న లెట్రిన్ శుభ్రం చెయ్యడానికి ఒక దళితుడు వచ్చేవాడు. అప్పట్లో అతను కేవలం ముప్పై రూపాయల కోసం వట్టి చేతితో గుడ్డ పట్టుకుని టాయ్లెట్ సీట్ మీద పెట్టి రుద్దేవాడు. ఒక మనిషి కేవలం ముప్పై రూపాయల కోసం అశుద్ధాన్ని ముట్టుకోవడం జుగుప్స కలిగించింది. నేను అతనికి టాయ్లెట్ బ్రష్ కొనిచ్చి అతనికి ఇచ్చే డబ్బులు 70 రూపాయలకి పెంచాను. అతనికి బ్లీచింగ్ పౌడర్ కూడా నేనే ఫ్రీగా ఇచ్చేవాణ్ణి. బ్లీచింగ్ పౌడర్ కంటే యాసిడ్‌తో శుభ్రం చెయ్యడం సులభం. మెటీరియల్ ఖర్చు నేనే పెడుతున్నాను కదా అని నా చేత యాసిడ్ కొనిపించాడు. యాసిడ్‌తో శుభ్రం చేస్తున్నప్పుడు వచ్చిన పొగలకి అతని కళ్ళు దెబ్బతిన్నాయి. అలా జరుగుతుందని తెలిస్తే నేను అతనికి యాసిడ్ కొనిచ్చేవాణ్ణి కాదు. అతను మా పట్టణ శివార్లలోని ఒక గ్రామ పంచాయితీకి స్కావెంజర్ (చెత్త శుభ్రం చేసేవాడు)గా పని చేసేవాడు. అతని కంటి చూపుపోవడంతో అతని ఉద్యోగం పోయింది. అతని భార్యకి మునిసిపాలిటీలో స్కావెంజర్ ఉద్యోగం దొరికింది కానీ అతని కంటి చూపుపోవడం, అది నేను ఫ్రీగా ఇచ్చిన యాసిడ్ వల్ల పోవడం నాకు బాధ కలిగించింది. ఇక్కడ అపాత్ర దానం కాదు కానీ అజాగ్రత్త దానం కొంప ముంచింది.

చెప్పారు...

ఇంకా, ఎవడో NGO వృద్దులకు మందులు అని ఫోన్ చేస్తాడు. మనం ఇచ్చాము అనుకోండి. వాడు ప్రతీ నెల ఇవ్వమని ఫోన్. అదే కాక ఉంకో వంద మంది కి ఆ నెంబర్ ఉవ్వటం. వాళ్ళు ఆలో లక్ష్మణా అని మనకు ఫోన్లు. నాకు బాగా విసుగు వచ్చింది.

ఒక మంచి మనసున్న మనిషిని, చివరికి ఎవడికి రూపాయి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యేలా చేసింది.

చెప్పాలంటే...... చెప్పారు...

కొన్ని సార్లు అంతే అండి మనం మంచికి పొతే చెడు ఎదురౌతుంది. ""అజాగ్రత్త దానం కొంప ముంచింది...."" ఇది బయటి వాళ్ళకు చేస్తే మాత్రమే కాదు... ఇంట్లో మన అనుకున్న వాళ్లకు కుడా చేసిన మంచి గుర్తు వుండదు.వాళ్ళ స్వార్ధం కోసం అమ్మానాన్నని కూడా విడదీయడానికి వెనుకాడరు డబ్బుల కోసం ..కుక్కని సింహాసనం మీద కుర్చోపెట్టినా అది సింహంలా బతకలేదు కదా దాని నైజం పోదు...అలానే పందికి పన్నిటి స్నానం చేయించినా కూడా మళ్ళి బురదగుంట లోనే పొర్లుతుంది సహజ లక్షణాలు పోవు.....ఇలాంటి మనుష్యులు ఉన్నంత కాలం....."" ఒక మంచి మనసున్న మనిషిని, చివరికి ఎవడికి రూపాయి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యేలా చేసింది."" ఇంతే .

శశి కళ చెప్పారు...

అందుకె పిల్లలకు డబ్బు విలువ ,బాధ్యత తెలిసున్డాలి.
ఇంకా తమను ఆదరణ ఇచ్చి నట్లు వాళ్ళు ఇంకొకరికి
సాయం చెయ్యాలని కూడ తెలిసుండాలి.యెమి
చెద్దాము..జాగ్రత్త గా సాయం చెయటం తప్ప.

Praveen Mandangi చెప్పారు...

Read this article: politics.teluguwebmedia.in/2013/04/blog-post_28.html?m=1

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner