9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

వినమ్ర వినతి....

కల్లోల కడలి తరంగం అంతరంగం
కలహంస నడకల నాట్యమయూరం
ఉప్పొంగే వరద ఉదృతం కోపావేశం
గల గల పారే సెలఏటి సరిగమల
గమకాలు వినసొంపైన సంగీతం
కన్నెర చేసి కరుణ చూపే కృష్ణమ్మ
ఉరవళ్ళ పరవళ్ళ వరద వెన్నెలగోదారి
ఒంపుల వయ్యారాల కన్నెకిన్నెరసాని
అందాల సోయగాల వయ్యారి యమున
కలువ కన్నియబాల కావేరి
మకరందాల మధుర మందాకినీ
సకల పాపాలు హరించు గంగమ్మ
పొంగులెత్తే వాగువంకలతో....గుండాల సుడిగుండాలతో...
జన జీవనాన్ని అతలాకుతలం అస్తవ్యస్తం చేయకుండా...
సొగసు సోయగాలతో...చల్ల చల్లని చూపులతో...
ప్రకృతి అందాలు పాడిపంటలు పుష్కలంగా....
ప్రశాంత జీవితం అందించాలని వినతి.

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శశి కళ చెప్పారు...

yenta baaga cheppaaru andi?nadulu karunistene maanava jaati manugada.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శశి

జవహర్ బాబు చెప్పారు...

నాక్కూడా ఇంత మంచి తెలుగు వచ్చుంటే ఎంత బాగుండేదో..చక్కగా కవితలు,కధలు రాసేవాడిని కదా!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner