29, డిసెంబర్ 2012, శనివారం

నువ్వేమిటో....!!

పంచుకోవడానికి పెంచుకున్న అనుబంధం ఎక్కడో...!!
నీకు తెలిసిన చుట్టరికమే...కాని ఒప్పుకోవు...!!
మమకారం మాటలు కరువై మూగబోయింది...!!
నువ్వు అలిగి నాతొ మాటాడనట్లే.!!
వేదన వర్షమై కన్నీరు ధారలా జారుతోంది...!!
నువ్వు కూడా జారిపోతున్నావు దొరకుండా...!!
నా అనుకున్న బంధమే నాది కానంటోంది...!!
నువ్వు నన్ను కాదనుకున్నట్లే.!!
జ్ఞాపకాల్లో బతికేద్దామంటే...
బతుకే జ్ఞాపకంలా అయిపొయింది...!!




28, డిసెంబర్ 2012, శుక్రవారం

అసలెందుకి విభజన వాదాలు...!!

అసలెందుకి విభజన వాదాలు...పని లేని వారు స్వార్ధ రాజకీయం చేస్తే అందరు కొట్టుకు చస్తున్నారు..ఇప్పుడు...!! తెలంగాణా వాదమైనా...సమైఖ్యాంద్ర వాదమైనా...ఇలా చాలా విభజన వాదాలు బరిలోకి వస్తున్నాయి...!! ఈ విభజన వాదాలతో....పొరుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ మనం ఎంత వెనుక బడి పొయామో....!!
అది ఎవ్వరు ఆలోచించరేంటి ....?? ఏ వాదమైనా రాజకీయ నాయకులకు ఉపయోగం కాని మనకు ఏదైనా ఒకటే..!! మన పని మనకు తప్పదు....ఏ ధరలు దిగి రావు...!!
ఆ చార్జీలు...ఈ చార్జీలు...అంటూ మనకు బిల్లుల మోతా తప్పదు...మనం కట్టకా తప్పదు...ఒక్క సారి కాస్త ఆలోచించండి...మన పక్క రాష్ట్రమైన గుజరాత్ ఎందుకు అభివృద్ధి పధం లో ముందుకెళుతోందో....!! మనమెంత వెనుకకు వెళ్లిపోయామో చూస్తూ కూడా ఇంకా ఈ విభజనల కోసం...పదవుల కోసం పాకులాడే రాజకీయ నాయకులకు...డబ్బుల కోసం పార్టీలు మార్చే నాయకులకు వత్తాసు పలుకుతారా..!!
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళాలా....వద్దా...!! అన్న నిర్ణయం మన చేతి లోనే ఉంది...కనీసం ఇప్పటికయినా కళ్ళు తెరచి నిజాన్ని చూడాలి....ఓటే....మన ఆయుధం....మంచి నిర్ణయం తీసుకొండ్...!!

27, డిసెంబర్ 2012, గురువారం

మనం ఎలా ఉంటున్నాం...!!

సినిమాలు చూస్తాము...పుస్తకాలు చదువుతాము...టి వి లో అన్ని చూస్తాము...కనపడిన వాళ్ళతో కబుర్లు చెప్తాము...వాళ్ళు అలా ఉన్నారు...వీళ్ళు ఇలా ఉన్నారు...అని మనకు నోటికి వచ్చిన మాటలు చెప్తాము....నీతులు బోలెడు చెప్తాము వినే వాళ్ళు ఉండాలి కాని....కాకపొతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోము...ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం..మనం మాత్రమే మంచి వాళ్ళమని....!!
వంద నీతులు చెప్తే కనీసం ఒక్కదాన్ని కూడా మనం పాటించాలనుకోము...మరి ఇదెక్కడి న్యాయమో...!! ఎవరో అన్నట్లు నీతులు పక్కవాడికి చెప్పడానికే అని...!! ఒక వేలు ఎదుటి వాడికి చూపిస్తే మన నాలుగు వేళ్ళు మన వేపే చూపిస్తాయి..కాకపొతే మనకు అర్ధమయి చావదు..!!
కోపాలతో....ద్వేషాలతో..మోసాలతో...అసూయతొ...నిండి పోయింది ఇప్పటి ప్రపంచం.....ఏ బంధమూ...బందుత్వము అక్కరలేదు...మనం బాగున్నామని అనుకోవడానికి ఏం చేయాలా...ఎవరిని బోల్తా కొట్టించాలా...!! అన్న ఆలోచన లోనే మూడువంతుల జీవితాన్ని కానిచ్చేస్తున్నాము...నటనలో మనం అందరి కన్నా ముందే ఉంటున్నాము...మనతో కూడా మనం నటిస్తున్నాం కదా..!! నటనలో మాత్రం పరిపూర్ణంగా జీవిస్తున్నాము....ఈ జీవితంలో...!!
గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలుగుతున్నామా...!! కనీసం ఒక్క నిమిషం అయినా శాంతిగా సంతోషంగా ఉండగలుగుతున్నామా...!! అలా లేనప్పుడు ఈ సంపాదనలెందుకో...!! ఈ నటనలెందుకో....!! కాకిలా కలకాలం బతికే కంటే...హంసలా అర నిమిషం బతికినా....చాలు...!! క్షణికావేశం లో అరిషడ్వర్గాలు మన మీద పెత్తనం చెలాయిస్తాయి...వాటికి మనం బానిసలం...అందుకే కొందరు మాత్రమే మహనీయులు....మనం మామూలు మనుష్యులం.....!!

26, డిసెంబర్ 2012, బుధవారం

డిలీట్ ఆప్షన్ ఉంటే.....!!

ఎప్పుడూ అందరూ వినే మాట పారవేయడం...మనకు నచ్చని వాటినో...ఇష్టం లేని వాటినో పారవేయడం ఓ సహజ ప్రక్రియగా తీసుకుంటాం...కాని ఆ..పారవేయడం అన్న మాట ఎదుటి వారిని ఎంత ఇబ్బంది పెడుతుందో ఆలోచించం...!! మన అవసరం తీరిన తరువాత వస్తువునైనా....వ్యక్తినైనా మరిచిపోయినట్లు నటించడమో...లేదా పక్కన పెట్టేయడమో చేస్తున్న రోజులివి....!! జ్ఞాపకాల్లో బతికేద్దామనుకునే వాళ్ళు కొందరైతే....జ్ఞాపకాలే లేని వాళ్ళు మరికొందరు....కొన్ని జ్ఞాపకాలు జీవితాలని చైతన్యవంతం చేస్తే...మరి కొన్ని జీవశ్చవాల్ని చేస్తున్నాయి..!!
వస్తువునైతే నచ్చక పోతేనో..లేదా ఇష్టం లేక పోతేనో పారవేసినట్లు మన జీవితంలో అలా నచ్చని వ్యక్తులను, జ్ఞాపకాలను  పారవేయగలమా...!! అలా చేయగలిగితే...!! ఎంత బావుంటుంది కదూ....!! ఇప్పటి పరుగులెత్తే కాలంలో కంప్యూటర్లలో డిలీట్ బటన్ ఉన్నట్లు జీవితంలో కూడా డిలీట్ ఆప్షన్ ఉంటే.....!! ఆ ఊహ చాలా బావుంది నాకైతే...!! మరి మీకో....!!

24, డిసెంబర్ 2012, సోమవారం

చంద్రునిలో మచ్చలా...!!

మనసెరిగిన మనసుతో ఆహ్లాదం
పంచుకునే పలుకులు
పెంచుకునే అనుబంధానికి ప్రతీకలు....!!
పగిలిన హృదయం నుంచి 
విరిగిన ముక్కలు ఏరుకుంటుంటే...
లెక్కలేనన్ని ముక్కల చుక్కల్లో...
కన్నీటి జ్ఞాపకాలు ఎన్నెన్నో....!!
అతుకులేసిన ఎదలో....
వెతల చారలు అలానే ఉండిపోయాయి...
నిరీక్షణలో నీరసించిన...
చంద్రునిలో మచ్చలా...!!

23, డిసెంబర్ 2012, ఆదివారం

ఎంత బావుండు....!!

దొరక్క దొరక్క దొరికిన పెన్నిధి
జారిపోతున్నానంటోంది జాలిగా చూస్తూ....
ఏమి చేయలేని నిస్సహాయతను చూసి..
పగలబడి నవ్వుతోంది కాలపాశం...
నేనెవరి కోసం ఎదురు చూడను
నా పని నాదే అంటూ...!!
చూస్తూ చూస్తూనే తరిగి పోతోంది
మబ్బుల చాటుగా నింగి లోని జాబిలి
జరుగుతున్న సంఘర్షణ యుద్దానికి  
మూగ సాక్షిగా ఉండలేక....!!
మరణ శాసనాన్ని మార్చి రాయడానికి
అపర బ్రహ్మను కానే కాను...!!
విధిరాతను మార్చి రాసే వింత...
జరిగితే.....!! ఎంత బావుండు....!! 

20, డిసెంబర్ 2012, గురువారం

కానరాని నీ కోసం....!!

అటు ఇటు ఎటు వెళ్ళినా...
తడబడే అడుగులు....
అదో ఇదో ఏదో అనుకున్నా...
నీ స్వరమే అనిపిస్తుంటే...
పక్కన కదలాడే కదలికలో కూడా...
నీ రూపమే కనిపిస్తుంటే...
జాడ లేని నీ ఉనికిని కాదని 
ఎలా ఊరుకొను...!!
ఎక్కడా...కానరాని నీ కోసం
ఏ తావినని వెదకను...!!





19, డిసెంబర్ 2012, బుధవారం

సంతోషంగానే ఉన్నా...!!




అన్నట్టు నా బ్లాగ్ కూడా ఏభై వేల వీక్షణలను దాటేసిందోచ్....మూడు వందల ఏభై టపాలను...ఏభై వేల వీక్షణలను కూడా దాటేసి మొత్తానికి నేను కూడా సంతోషంగానే ఉన్నా...!!

18, డిసెంబర్ 2012, మంగళవారం

నిర్లక్ష్యానికి మూల్యం.....!!

బంధాలను బంది చేసి
బాధ్యతలను గాలికి వదలి
టింగు రంగా అంటూ...
పైలా పచ్చీసు గా తిరిగే
ఓ ఘరానా పెద్దమనీషి...!!
తెల్ల చొక్కాలో అంతా తెలుపే....
అని నువ్వనుకుంటే సరిపోదోయి...!!
ఊసరవెల్లి రంగులు పదుగురికెరుకోయి...!!
పని పాటా లేక నువ్వు చెప్పే 
గాలి కబుర్లు వినే వాళ్ళు కూడా...
నిన్ను చూసి చాటుగా నవ్వుకుంటున్నారు...!!
కోట్లకు అధిపతిని అని నువ్వు గొప్పలు చెప్పుకున్నా....
పైసాకు గతిలేని వాడివని తెలియనిదెవ్వరికి...??
మోసాలు వేషాలు అన్ని మానవోయి...
బంధాలను బాధ్యతలను విడనాడక
అభిమానానికి అందిచవోయి నీ చేయి...!!
అవసరానికి నీకడ్డు పడే అనుబంధమదేనోయి...!!
ఎండమావులే ఒయాసిశ్శులని వెంపర్లాడకోయి..!!
నిర్లక్ష్యానికి మూల్యం వెలకట్టలేనిదోయి...!!
చేజార్చుకుంటే...బ్రతుకే...చీకటోయి..!!
బతుకు విలువ తెలియకపోతే....

జీవితమే చేజారిపోతుంది జాగ్రత్తోయి....!!

17, డిసెంబర్ 2012, సోమవారం

ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!

కొత్త పరిచయాలు ఒక్కోసారి భయంగా అనిపిస్తూ ఉంటాయి....!!
అలా అని అన్ని ఒకేలా ఉండవు...ఒకప్పుడు పరిచయాలకు అనుబంధాలకు ఉత్తరాలే వారధిగా ఉండేవి....ఎంత దూరంలో ఉన్నా...ఆలోచనల్ని, ఆనందాన్ని...
ఇలా ఏ అనుభూతినైనా పంచుకోవడానికి
ఉత్తరాలే బావుండేవి...!!
ఇప్పట్లా ఫేస్ బుక్ లు...చాట్ లు లేకపోవటమే..అప్పట్లో....!!
ఉత్తరాల జ్ఞాపకాలు ఇప్పటికి...ఎప్పటికి మధురంగా బావుంటాయి...నాకైతే...!!

ఇప్పట్లో ఫేస్ బుక్ ఎకౌంట్ లో కాని మరే ఇతర చాట్ ఎకౌంట్ లో కాని ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటె అంత గొప్ప...మనకు తెలిసిన వాళ్ళే కానక్కరలేదు..ఎవరైనా పర్లేదు అని ఓ కే అంటే ...అన్ని బావుంటే పర్లేదు...కాని ఏ చిన్న తేడా వచ్చినా జీవితమే మారిపోయే అవకాశం ఎక్కువ..!!
ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని మనకోసం వాడుకోవాలనుకోవడం మాత్రం సరియైన పద్దతి కాదు..అలా కాకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పరిధిలో మనం ఉంటే ఏ పరిచయమైనా పది కాలాలు ఉంటుంది....!! మన మూలం గా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది గుర్తు ఉంటె చాలు...!!
నాకేదో కష్టం ఉందని ఎదుటి వాళ్ళు జాలి చూపించాలి...సాయం చేయాలి...ఇలా ఏవేవో అనుకుని స్నేహం చేయడం తప్పు...కష్టం, సంతోషం పంచుకోవడం తప్పు కాదు...ఎదుటి వాళ్ళ జీవితంలోకి మనం చొరబడాలనుకోవడం తప్పు...!! వాళ్ళకంటూ ఉన్న సమయాన్ని వాళ్లకు వదిలేయండి....పలకరించినప్పుడు మాట్లాడండి...!! ఎప్పుడూ....మాట్లాడాలనుకోవద్దు..అది ఇద్దరికి మంచిది కాదు....ఆ స్నేహం ఎక్కువ కాలం నిలువదు...!!
ఉత్తరాల్లో ఉన్న నిజాయితీ ఇప్పటి స్నేహాల్లో ఉందని అనుకోవడం కూడా పొరబాటే....!!
చాలా తక్కువ స్నేహాలు ఏ కల్మషం లేనివి ఈ రోజుల్లో....!!
ఎనిమిది ఏళ్ళు ఒకరిని ఒకరు చూసుకోకుండా రాసుకున్న ఉత్తరాల స్నేహం
ఇప్పటికి అప్పటి పరిమళాలతో అలానే ఉంది....!!
మరి ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!

16, డిసెంబర్ 2012, ఆదివారం

దేవుడు - లంచం - మనిషి....!!

మనకు తెలివి చాలా ఎక్కువ...!! ఎలా అంటారా....!! మనని సృష్టించిన దేవుడికే లంచం ఇస్తూ ఉంటాము కదా...!! మన పని చేయించుకోవడానికి...!! నిజంగా మనిషి ఎంత గొప్పవాడు...!! తనని సృష్టించిన దేవునికే లంచం ఇవ్వచూపి తన పని చేయించుకుంటున్నాడు..!! ఆ దేవుడే తన సృష్టి గొప్పతనానికి కి తలవంచుతున్నాడు..!!
అందుకే...ఓ మనిషీ....నీకు జోహార్లు....!!
దేవునితో మొదలు పెట్టిన లంచం అలా అలా పయనించి అందరిని అల్లుకు పోయింది విడదీయరాని లతలా...!!
అందులోను మన భారతీయులకు సనాతన సాంప్రదాయాలు చాలా ఎక్కువ కదా....!! ఒక్కరేంటి అందరు పాటిస్తారు...అందుకే...మనం లంచాల్లో మొదటి స్థానంలోనే వుండి వుంటాం..!!
అయినా దేవుడే మొక్కులకు లొంగి పోతాడు కదా...!! మనము అంతే లెండి తప్పేమీ లేదు..అని సరి పెట్టుకుంటే పోలా...!!

15, డిసెంబర్ 2012, శనివారం

సంఘర్షణ...!!

ఎందుకలా వదిలేసి వెళ్ళిపోయావు...??
నచ్చలేదనా...!! అర్ధం కాలేదనా...!!
చెప్పాపెట్టకుండా అలా వెళిపోతే....ఎలా..!!
ఆద్రత తో దగ్గరకు తీసుకుంటావనుకుంటే...!!
అక్కరలేదని పోతున్నావు...!!
పక్కనే ఉన్నా దూరం బోలెడు....!!
అంతరమో...!! అహమో..!!
అడ్డుగోడగా ఉంది మధ్యలో..!!
మారని నేను..మారిన విలువలతో....నువ్వు..!!

నీ సాన్నిహిత్యం లో సన్నిహితం దూరమైంది నాకు...!!
అందుకే ఈ తెలియని అంతరంగపు సంఘర్షణ...!!

14, డిసెంబర్ 2012, శుక్రవారం

జీవిత పుస్తకం...!!

నాకు నేనే ఒక అర్ధం కాని వింత పుస్తకాన్ని...!! అలాంటప్పుడు ఎదుటి వారు నాకెలా అర్ధం అవుతారు..??
నేను వాళ్ళకెలా తెలుస్తాను...!! తెలియాలని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది..!!
నాలోనూ ఆవేశం..కోపం..ద్వేషం..బాధ..సంతోషం....ఇలా అన్ని భావావేశాలు ఉన్నాయి. ముఖచిత్రం బావుందని పుస్తకం తెరిస్తే ముందుగా ముందు మాటల్లో సంక్షిప్తంగా కాస్త తెలుస్తుంది మనసు తెలిసిన వాళ్లకి...!! ముందు మాటల్లో గొప్పగానే పొగడ్తలుంటాయి కాక పొతే అన్నీ నిజాలు కాదేమో...!! అలా అనిపించడానికి కారణం మన గురించిన నిజాలు మనకి తెలుసు కదా..!!
ఎంత మంచి పుస్తకమైనా అందరికి నచ్చాలని లేదు....అలానే పొగడ్తలకు చోటున్నట్టే విమర్శలకు స్థానముంటుంది...!! పుస్తకంలో మొదలు పెట్టిన ప్రతి పేజి బావుండాలనే అందరికి నచ్చాలనే అనుకుంటాము...కాకపొతే దేవుడే అందరికి మంచివాడు కాదు కదా....ఇక మనమెంత...!!
కొన్ని పేజీలు ఖాళీగా వదిలేద్దామని అనుకుంటే కుప్పలు తెప్పలుగా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాల పుటలు దొంతర్లుగా వచ్చి చేరతాయి....మరి కొన్నేమో మనం ఎంత అందంగా నింపుదామన్నా అలా ఖాళీగానే ఉండి పోతాయి ఎప్పటికి...!!
పుస్తకంలో మొదటి చివరి పేజీలు అందరికి ఒక్కటే.....మధ్య పేజీలు ఎలా....అన్నది మన ఇష్టం....!!
ఎంతో అందంగా మొదలైన  పుస్తకం లోని మొదటి పేజి అలా అలా పేజీలు పెరుగుతున్న కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ....కలల్ని...ఆలోచనల్ని..కాలంతో పాటుగా మోసుకుంటూ...మర్చిపోలేని పేజీలను దాచుకుంటూ...అక్కరలేని పేజీలను వదిలేస్తూ...అలా పయనిస్తూ చివరికి చివరి పేజీలోకి వస్తే.....!!
ఏముంది కధ సుఖాంతం...!! 

13, డిసెంబర్ 2012, గురువారం

గమనిక....!!



నిన్న నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన కవిత అపురూపం 12-12-12 12:12:12 కి.....
ఒక్కరు గమనించారు...సంతోషం...!!
అన్నట్టు ఆ టపా నా 350 వ టపా అండి...అబ్బో చాలా రాసేశాను కదూ....!!
ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు....!!

12, డిసెంబర్ 2012, బుధవారం

అపురూపం...!!

ఏమైందో ఏమో తెలియడం లేదు కాని...
నీతోనే ఉన్న నా మనసు నాతొ మాటాడనంది...!!
నాతొ అలుకో మరి..నేనంటే అ ఇష్టమో...!!
సరే అని నీతో పంచుకుందామంటే....
నీ మనసు నీ మాట వినదాయే....!!
అది నాదగ్గరుంది...!!
ఏమిటో...నేను నీ దగ్గర...!!
నువ్వు నా దగ్గరా....!!
మరి ఇద్దరం కలిసేదెన్నడో...!!

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఇదీ బావుంది....!!

చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో....
నిట్టూర్పో..
నిస్సహాయతో...
ఏదో తెలియని...
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో....!!
ఏకాంతంతో సహవాసమో....!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే...!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే.....
మెల్లగా తడిమి వదలి పోయింది....
నీ జ్ఞాపకాలతో నన్నుండమని....!!

ఎలా చెప్పినా....!!

చుక్కల్లో ముగ్గులేసి
మేఘాల్లో రంగులద్ది
మెరుపుల్లో మాయతో
హరివిల్లు సృష్టించినా....
నీ పెదవి పై జాలువారే...
చిరునవ్వు కి సరిపోవు....!!
ఇంకెందుకు నీకు అలుక..??
విరి పువ్వుల కుసుమాలతో....
ఇదిగో....అక్షరాంజలి...అందుకో...!!





10, డిసెంబర్ 2012, సోమవారం

మౌనమైన మనసు.....!!

మాటలు రాక మూగబోయింది మనసు
మనసు తెలుపలేక అలసిపోయింది మౌనం
మౌనం మనసు మాటలకు సాక్ష్యమా....!!
మాటలేని మౌనంలో మనసు రాగాలెన్నో...!!
మాటలాడే వేళ మనసు తెలిసినా....
మౌనమైన మదిలో మాట తెలిసినా...
మాట మౌనమైనా...మనసు మాటాడుతుంది....!!

9, డిసెంబర్ 2012, ఆదివారం

గాయం....!!

గాయం చేసేది మనిషి
గాయపడేది మనసు
మనిషి గాయం మానుతుంది
మనసు గాయం మానదు
మనిషి మాయలో మనసు
ఆ మత్తులో మనసు చిత్తు
చిత్తైన మనసుకు చివరికి
మిగిలేది మనసు ముక్కలే....!!

8, డిసెంబర్ 2012, శనివారం

వెదుకులాటలో......!!

అందని హద్దు ఆకాశం అయినా అందుకోమంటూ
దగ్గరగా రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతూ
మురిపిస్తూ మెరిపిస్తూ దగ్గరైనట్లే అనిపిస్తూ
దూరం దూరం పోతూనే ఉంటుంది...అచ్చం నీ లానే...!!

ఇదిగో ఇక్కడే ఉంది ఆవలి తీరం అంటూ...
అంతే లేని తీరం తెలియని సంద్రంలా...ఉన్న నీ మదిలో....
వెదుకుతూనే ఉంటుంది కనపడని తీరాన్ని
చేరాలనే తపనతో....అర్ధం కాని నీ మనసు
కలశంలో ఓ చిన్ని బిందువులా నా జ్ఞాపకం...
దాగుందేమో అని చిరు ఆశతో...!!
ఆనవాలు ఏమైనా దొరుకుతుందని తపనతో...!!
మరి దొరుకుతుందో....!! లేదో....!!

4, డిసెంబర్ 2012, మంగళవారం

ఈ మాటని చెప్పారేమో....!!

పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదని అందరికి తెలిసిన పెద్దలు చెప్పిన సామెత కదా....!! ఇది నిజం అంటాను నేను....కాదనే వాళ్ళు చేతులెత్తండి...ఎంత మంది నాకు ఓటేస్తారో చూసి...దానిని బట్టి నేను రాజకీయాల్లోకి వెళ్లి... పార్టి పెట్టి కాస్త సొమ్ము సంపాదిన్చుకుందామని ప్లాను....ఎవరికీ చెప్పకండేం...!! మళ్ళి నాకు పోటి ఎక్కువైపోతుంది...!!
సరే మరి...చేతులెత్తితే నాకు కనపడి ఛావదు కదా అందుకే కామెంట్లు పెట్టేయండి.....!!
ఎంత గొప్ప  వైద్యుని వైద్యమైనా ఇంట్లో పనికిరానట్లే..!!
ఎంత గొప్పవారైనా పదిమందికి మంచి చేసినా ఇంట్లో పనికిరానివారే....!!
అందరికి నచ్చినా ఇంట్లోవాళ్ళకి నచ్చని వారే....!!
ఇలాంటివి అన్ని చూసే మన పెద్దలు ఈ మాటని చెప్పారేమో....!!

30, నవంబర్ 2012, శుక్రవారం

నీకు నాకు మద్య....!!

అనుబంధం అక్కడే ఆగిపోయింది
పిలుపు లేదని అలుకేమో....!!
ఆప్యాయతా అలుకలోనే ఉంది
అనుబంధానికి తోడుగా...!!
గుండె గూటిలోని గుప్పెడు మనసు
రెప రెపలాడుతోంది...ఏదో చెప్పాలని....!!
మాటలు తెలియక మూగబోయింది...!!
అల్లిబిల్లి గారడిలతో అసలు విష్యం
తెర చాటున దాగుంది గోప్యంగా...!!
తెర తీయగ రావా....!!
మది నిండిన నీ మౌనం
మాటలకందని మసను సాక్షాత్కారం...!!
మనసు ఊసులకు...మాటలెందుకు...??
అయినా నీకు నాకు మద్య....
ఈ అలుకలు మాటలు అవసరమా...!!
నువ్వు నాకు నేను నీకు తెలియక పొతే కదా...!!
పాత పరిచయమే...మళ్ళి సరికొత్తగా....!!

29, నవంబర్ 2012, గురువారం

దూరం చేయకండి....!!

నాకేనా ఇలా అనిపిస్తుంది లేక అందరికీ ఇలానే అనిపిస్తుందా....!! తప్పకుండా కొందరికైతే అనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను....!! చిన్నప్పటి జ్ఞాపకాలు కాని....చదువుకునేటప్పుడు చేసిన చిలిపి పనులు కాని...మనం స్నేహితులకు చెప్పిన మాటలు కాని...నేస్తాలు మనకు చెప్పిన ఊసులు కానీ....చాలా వరకు ప్రతి పరిచయంతో మనకున్న మంచైనా...చెడైనా...కొంతైనా జ్ఞాపకం లేకుండా వుండదు కదా..!!
ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి దూరంగా వెళిపోతారు....ఏమి కారు...అనుకున్న వారు దగ్గరగా వస్తారు....!! కొన్ని పరిచయాలు పెంచుకోవాలనిపిస్తే...మరికొన్ని తుంచుకోవాలనిపిస్తాయి..!! పరిచయం పరిమళ భరితంగా ఉండాలి కాని....!!
నాకున్న పరిచయాలలో...కొందరేమో మనం దగ్గరగా వెళ్ళినా దూరం జరిగి పోతున్నారు....మరికొందరేమో ఆప్యాయంగా దగ్గరకి వస్తున్నారు....ఎప్పుడూ ఒకేలా అందరితో ఉన్నా మరి ఈ తేడా ఎందుకో...!!
అవసరానికి మాత్రమె....స్నేహమా.....!! చుట్టరికమా.....!! అనుబంధమా.....!! అవసరం తీరినా....ఇల్లు దాటినా ఇక నువ్వెవరో....!! నేనెవరో....!! అన్నట్లుంది ఈ రోజుల్లో...డబ్బులు అడుగుతారనో....సాయం చేయమంటారనో....లేక ఇంకేదైనా అడుగుతారనో....భయపడక...కనీసం కొన్ని పరిచయాలనైనా....అనుబందాలనైనా గుర్తు ఉంచుకోండి....!!
మనమే....ఇలా ఉంటె మన తరువాత తరాలకు అమ్మ...నాన్న బంధం కూడా గుర్తు లేకుండా పోతుంది....!! బంధాలకు మారు పేరైన భరతావనిని అనుబంధాలకు....అభిమానాలకు దూరం చేయకండి....!!

27, నవంబర్ 2012, మంగళవారం

కొందరెందుకో....ఇలా...!!

చిన్నప్పటి నుంచి ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఓ పక్కన ఉంటుంటే వాడు ఎవరితో మాట్లాడడేమో వాడి మనస్తత్వం అంతేనేమో అనుకునేదాన్ని...చాలా ఆలస్యంగా అసలు విష్యం తెలిసింది....చిన్నప్పటి నుంచి కష్టాన్ని...సంతోషాన్ని ఒక్కడే పంచుకున్నాడు అందరు ఉన్నా....అందరిలో ఉన్నా...ఒంటరిగానే ఉన్నాడు అని....!!
అర్ధం చేసుకోవాల్సిన నాన్న కూడా ఏమి కానట్లు ఉంటుంటే ఎంత కష్టంగా ఉంటుంది...పిల్లలు పదిమంది ఉన్నా అందరిని సమంగానే చూస్తారు తల్లిదండ్రులు అని అందరం అనుకుంటాము....ఒక్కోసారి ఒక్కో బిడ్డ మీద ఎక్కువ శ్రద్ద చూపించాల్సిన  పరిస్థితి వస్తుంది....పరాయి అమ్మ కన్న బిడ్డ అని తేడా లేకుండా పెంచే తల్లులు ఎంత మంది ఉన్నారు..?? అమ్మతనానికే అవమానం చేస్తున్నారు...అమ్మ పరాయిదయినా నాన్న మనవాడే అనుకుంటే అది చాలా తప్పయిపోతోంది...మాటలు చెప్పి మోసగించే వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారు....బాధ్యతగా అన్ని చూసినా శత్రువుని చేస్తున్నారు....సొంత ఇంటిలోని వారే ఇలా చేస్తుంటే.....!! బంధాలకు అర్ధం ఎక్కడ...!! సొంత అన్న/తమ్ముడి  మీదే కత్తి దువ్వే తమ్ముళ్ళు/అన్నలు   మీకు జోహారులు....!! మన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి మీద నేరాలు మోపకండి....తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టకండి....అన్నం పెట్టిన చేతిని కరవకండి....!! కాస్తయినా మానవత్వంతో మెలగండి...!! మనకన్నా జంతువులు నయం అని అనుకోనివ్వకండి...!! మనని వాటితో పోల్చినా అవి కూడా సిగ్గుతో తలదిన్చుకుంటాయి...!!

ఎందుకో ఇంకా అర్ధం కాలేదా...!!
అంతా సొమ్ము మహిమే....!!

26, నవంబర్ 2012, సోమవారం

ఈ రోజు ఏమైందంటే....!!

ఈ రోజు పొద్దున్న బాగా పనిలో ఉన్నా....ఆ టైం లో గేటు బయట నుంచి ఎవరో పిలిచినట్లు వుంటే చూసాను..ఇద్దరు కాస్త పెద్ద వాళ్ళు ఏదో అడిగారు.
 పని వత్తిడిలో వుండి చేయి ఊపాను..        వెళిపొమ్మని...తరువాత ఎందుకో పాపం అనిపించింది...బయటికి వెళ్లి చుస్తే రెండిళ్ళ అవతల వున్నారు....గట్టిగా పిలిచి ఎదురువెళ్ళి ఇచ్చింది పది రూపాయలు మాత్రమే...!! ఎందుకో వాళ్ళ ని వెళిపొమ్మని అన్నందుకు  నన్ను నేనే తిట్టుకున్నాను...అందరికి ఇవ్వాలని అనిపించదు..కాని కొన్నిసార్లు మాత్రం ఇలానే చేస్తూ ఉంటాను...చిన్నప్పటి నుంచి అంతే...ఎక్కువగా ఇవ్వలేక పోయినా నాకు తోచినంత ఆ టైం కి నా దగ్గర ఉన్న దానిలో కొంత ఇస్తూ ఉంటాను...!! ఇంట్లోవాళ్ళు తిట్టినా పిలిచి మరీ ఇచ్చేదాన్నంట...నా కొడుకులు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని అంటారు...ఇవ్వకపోతే కోపం...!! ఒక సారి ముసలి తాత కి అడిగితే పది రూపాయలు నా చిన్నకొడుకు ఇచ్చాడంట...అమ్మ ఏంటి చిన్నా పది ఇచ్చేసావు అంటే కనీసం ఒక చాక్లెట్ అయినా రాదు కదే రూపాయికి అని అన్నాడంట...ఈ మధ్యనే ఒకావిడ వస్తే మేము వెళిపోమ్మని చెప్తే పెద్దాడు పాపం అమ్మా ఏమైనా డబ్బులు ఇవ్వు అంటే ఇస్తే మళ్ళి పాత బట్టలు కావాలంట ఇస్తావా లేదా అని గోల...కాసేపు పిల్లల మీద అరిచి అందరికి ఇవ్వకూడదు అని నచ్చచేప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చిందంటే నమ్మండి...-:) ట్రైన్ లో వెళ్ళినా పిల్లలతో ఇదే గోల....!!

మా అమ్మ అమ్మమ్మ నీలానే నీ కొడుకులు అని గోల....!!

25, నవంబర్ 2012, ఆదివారం

డాక్టర్ ది తప్పా...!! లేక మన ఖర్మా....!!

మామూలు రోగమో రొప్పో వస్తేనే డాక్టరు దగ్గరకి వెళతాము.....అలాంటిది ప్రాణాంతకమైన జబ్బు వస్తే మంచి పేరున్న డాక్టరు దగ్గరకే వెళతాము కదా..!! మన రాజధానిలో పెద్ద పేరున్న డాక్టర్ అని వెళితే ఒక పేషంట్ అని కాకుండా చాలా మందికి తప్పుడు వైద్యం చేసిన ఆ మహా మేధావిని మరి ఏం చేయాలో...!! లేక మన ఖర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలో...!! బాధ భరించ లేకే కదా డాక్టర్ దగ్గరికి వెళతాము...వాళ్ళేమో నిర్లక్ష్యంతో ఉంటున్నారు...!!
నాకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ రాంగ్ ప్లేస్ లో చేసారు ...మరి బాగా పేరు అనుభవం ఉన్న డాక్టరే...అది కాక మళ్ళి అమేరికాలో అమెరికనే....నా టైం బాలేదని సరిపెట్టుకున్నా!!
కాన్సర్ మహమ్మారి అసలే తగ్గని రోగం...!!  చచ్చిపోతాము అని తెలిసి కూడా మృత్యువుతో చివరి ఘడియ వరకు పోరాడుతాం...ప్రాణం మీద తీపితోనే కదా..!! కిమో ఇచ్చి ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది కాకపొతే మళ్ళి రాకుండా ఉండటానికి రేడియేషన్ తీసుకోండి అని చెప్తే ఎవరైనా తీసుకోకుండా వుండరు కదా...!! కనీసం రేడియేషన్ ఇచ్చినది ఎక్కడో కూడా ప్రిస్కిప్షన్ లో నోట్ చేయకుండా ఇచ్చిన డాక్టర్ ది తప్పా..!! లేక చూసి కూడా చూడనట్లు వున్న రేడియేషన్ తీసుకోవాలి అని చెప్పిన డాక్టర్ ది తప్పా...!! ఏ దారి లేకపోతె ఆఖరున ఇచ్చే  ట్రీట్మెంట్ ముందే తీసుకోమని చెప్పిన డాక్టర్ ది తప్పా...!!
ఎంతో మంచి పేరున్న వైద్యులున్న మనకి ఇప్పుడు ఇంత నిర్లక్ష్య వైద్యమా...!! మా పెదనాన్న గారూ వైద్యులే....నాడి చూసి మనకేంటో చెప్పగల మంచి వైద్యులు...మరి ఆ రోజుల్లో ఆయన చదివింది ఎం బి బి ఎస్ మాత్రమే....!! 
మొత్తానికి వైద్యం కూడా ఎవరి ఖర్మానికి వాళ్లకి రాసిపెట్టినట్లుంది....రోగం రావడం ఒక ఎత్తయితే సరియైన డాక్టర్  దొరకడం మన అదృష్టం దురదృష్టం మీద ఆధారపడినట్లుంది....!! మొత్తానికి దేవుడు ఆయుష్షు ఇచ్చినా ధన్వంతరి ఆ ఆయుష్షు తగ్గించేస్తున్నాడు....!! కనీసం రోగం వస్తే అది ఎందుకు వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో డాక్టర్లు ఉంటే ....!! తప్పు ఎవరిది..??
నాయనా ధన్వంతరీ.....మీరే దిక్కని వచ్చిన జనాలకి దేవుడిచ్చిన ఆయుష్షుని మీరు మధ్యలోనే పూర్తి చేయకుండా కాస్త ప్రాణం నిలపండి....!!

ఆ మనీషికి.....!!

ప్రళయంలో ప్రశాంతతా...!!
విలయంలో విశ్రాంతా...!!
ఎలా సాధ్యం...??

కోపాన్ని ద్వేషాన్ని
ప్రేమని ఆప్యాయతని
ఇష్టాన్ని నిర్లక్ష్యాన్ని
సంతోషాన్ని....
వెనువెంటనే బాధని...

ఇలా అన్ని ఒకేలా....
స్వీకరించే మనసుకి సాధ్యమేమో...!!

అందుకే.....ఆ మనసున్న...
మనీషికి పాదాభివందనం..!!

24, నవంబర్ 2012, శనివారం

బడా మోసాలు మాయలు

ఏంటో ఈ జీవితం అనిపించేస్తోంది ఒక్కోసారి....!!
చదువు, పెళ్లి, ఉద్యోగం, బాధ్యతలు, బరువులు....ఎదురు మాటలు పడటం తప్ప తిరిగి చూసుకుంటే ఏమి కనిపించడం లేదు....అంతా ఖాళీగా అనిపిస్తోంది....!!
పెళ్లి తో మనిషి నైజం కాస్త అర్ధం అయితే....అది పోను పోనూ మానవ నైజం అంతే....అని నిరూపిస్తోంది.
నమ్మకంతో మోసం చేసే వాళ్ళు, మాటలు తీయగా చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు, వాళ్ళ స్వార్ధం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడని వాళ్ళు....ఇలా ఎన్నో ఆటుపోట్లు....!!
మద్యలో డబ్బుల మొహం చూసిన వాళ్ళు ప్రపంచం లో అది తప్ప ఇంక ఏది ముఖ్యం కాదు అనుకుంటారు...!!
ఈ రోజుల్లో మనం చూస్తున్న మోసాల్లో కార్పోరేట్ కంపెనీల ఘరానా మోసాలు అందరికి తెలిసినవే....!!
వాళ్ళు మాత్రం బానే దాచుకుంటారు జనాలకి జీతాలు మాత్రం ఎగ్గొడతారు...
నలుగురైదుగురు కలిసి కంపెని పెడతారు...ఆ రికమండేషన్ ఈ రికమండేషన్ అంటూ వాళ్ళ వాళ్ళ చుట్టాలకి పక్కాలకి మంచి పొజిషన్లు ఇస్తారు ఏమి తెలియక పోయినా....ఏమి చేయక పోయినా అది చేసారు ఇది చేసారు అని హైకులు బాగా ఇస్తారు..వాళ్లకి అడ్డం వచ్చిన వాళ్లకి మొండి చేయి చూపిస్తారు...వాళ్ళు  చేసే మోసాలు మిగిలిన పార్టనర్స్  కి తెలియకుండా ఉండటానికి ఎన్నో జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేస్తూ మాయ చేస్తూ నిజాన్ని కప్పేస్తారు....సదరు అధికారి కళ్ళు తెరిచి చూసే సరికి ఏముంటుంది ఐపి పెట్టి మాయమవడం తప్ప...!!
హైదరాబాద్ లో అమెరికాలో పెద్ద పేరున్న కంపెనీలో పని చేసినప్పుడు మన పని మనం చేసుకు పోతున్నాము కదా అనుకుంటే ఓ మహానుభావుడి వల్ల తిట్టడం తెలియకుండా తిట్టడం అంటే ఏమిటో తెలుసుకున్నాను....మరో పున్యాత్ముడి వల్ల మాటలు కోటలు దాటుతాయి కాని ఉపయోగం వుండదు అని తెలిసింది....మరో బాబు తెలిసిన వాళ్లకి నచ్చితే ఉద్యోగం ఇవ్వండి అంటే బాగా.....ఇంటర్వు చేసినట్లు నటించి అప్లికేషన్ మీ దగ్గరే ఉంచండి క్లయింట్ ఓ..కే చేయగానే జాబ్ ఆపర్ పంపిస్తాము....అని...అసలు కారెక్టర్ ఇంకోటుంది నేను అసలు ఆయనా బాగా......క్లోజ్ వాళ్ళ చుట్టాల కన్నా అన్ని నాతోనే పంచుకుంటారు...ఎవరు ఏది చెప్పినా నాకు చెప్పి కాని చేయరు....అంతా నేనే అన్నట్లు..!!
నిజం గా అక్కడ పని చేసినన్నాళ్లు అనిపించింది రాజకీయనాయకులకు మంచి ట్రైనింగ్ దొరుకుతుంది ఇక్కడ పని చేస్తే....వర్క్ మాట ఏమో కాని నటన, కుళ్ళు , కుతంత్రాలు బాగా తెలుస్తాయి అని...!!
చివరికి అసలు మనిషి కూడా వాళ్ళతో చేరి అందరిని మోసం చేసాడు...
డబ్బు పొతే సంపాదించుకోగలం....మాటా మంచి పొతే ఎంత బతుకు బతికినా శవంతో....సమానమే...!!
రాజకీయ నాయకులు కనీసం ఓటు కోసమైనా జనం దగ్గరికి వస్తారు ఎన్నికలప్పుడు....మరి ఈ కార్పోరేట్ కంపెనీల బారిన పది మోసపోతున్న జనాలకు న్యాయం జరిగేదేలా...??

నీతో సాన్నిహిత్యం.....!!

ఏదైనా ఏమైనా
ఎద నిండా నీ స్వరమే...!!
ప్రేమైనా ప్రాణమైనా
నీతోనే నా పయనం....!!
బాధ్యతల శృంఖలాలు
బంధాలై అడ్డు పడుతుంటే....!!
చేరువైన నీ సాంగత్యం
చేయి అందిస్తే...!!
అంతు లేని సుడిగుండాలలో కూడా...
ఆనందమయ జీవనమే...!!

23, నవంబర్ 2012, శుక్రవారం

ఎంత కష్టమో..!!

నువ్వెక్కడో...నేనెక్కడో....!!
తెలియని తీరాలు మనవి
చేరే గమ్యం ఎక్కడో...!!


కలవని సమాంతర రేఖలే...
అందుకు సాక్ష్యం...!!
ప్రళయమైనా...ప్రణయమైనా...
అనుభవానికి రెండూ ఒక్కటే...!!

విలయంలో వినిపించే గీతమైనా
లయబద్దంగా సాగే సంగితమైనా
శూన్యమైన మనసుకు ఒక్కటే...!!

వేదనలో కనిపించే విషాదమైనా
మనస్పూర్తిగా లేని సంతోషమైనా
ఫలితం ఒక్కటే...!!

చేరే దారి తెలిసినా...
చేరలేని జన్మకు ఎంత కష్టమో..!!

22, నవంబర్ 2012, గురువారం

నా దగ్గరేం లేవని.....!!


కలతనిదురలో నీ రూపం మాయమౌతోంది
మెలకువలో కనిపించని నీ రూపాన్ని 
గీతల్లో పొందుపరుద్దామంటే చేతిలోని
కలం కదలనని మొరాయిస్తోంది
ఆగని కాలం సాగిపోతూనే వుంది
జ్ఞాపకాల పేజీలు మోసుకుంటూ...
ఖాళీగా వెళిపోయింది...!!
కాకపొతే ఒకటే మార్పు....!!
ఒక్క...నీ గురుతుల దొంతరలు
మాత్రం నా దగ్గర వదిలేసింది...!!
ఎందుకని అడిగితే...
మోయలేనంత భారమంది..!!
కాలానికి కూడా తెలిసింది...
నీకే తెలియడం లేదు...!!
నీ జ్ఞాపకాలు తప్ప మోసుకుపోవడానికి
నా దగ్గరేం లేవని.....!!

18, నవంబర్ 2012, ఆదివారం

ఇలా ఐతే ఎలా.....!!

దగ్గరగా వచ్చావు అనుకుంటే
దూరంగా వెళతావు
దూరంగా ఉన్నావు అనుకుంటే
దగ్గరగా వస్తావు
మరచిపోదామని అనుకుంటే
గమ్మత్తుగా పలకరిస్తావు
పలకరిద్దామని వస్తే
నువ్వు ఎవరో తెలియదంటావు
కల అని నేనంటే
కాదు వాస్తవమంటావు
నిజమని నేనంటే
కలత నిదురని నువ్వంటావు
కలకాలం నాతొ ఉండమని అంటే
క్షణమైనా నిలువలేనంటావు
నను వీడి పొమ్మంటే
ప్రతి క్షణం నాతోనేనంటావు
ఇలా ఐతే ఎలా వేగేది నీతో.....!!

17, నవంబర్ 2012, శనివారం

ప్రపంచంలో....ఎక్కడ ఉన్నా...!!

అమెరికా వదిలి వచ్చేసిన తరువాత వేళ్ళ మీద లెక్కబెట్టుకోవచ్చు ఎంతమంది పలకరించారో...!! పలకరిస్తున్నారో...!! ఎంత పనిలో వున్నా రెండు నిమిషాలు మాట్లాడలేనంత తీరిక లేకుండా ఎవరు వుండరు...మనసులో వుండాలి కానీ మాట్లాడే తీరిక అదే వస్తుంది...!!
ఎందుకో మరి జనాలు ఇలా అవసరానికి మాటలు ప్రేమలు ఒలకబోస్తూ వాళ్ళ లాభం చూసుకోవడం....!! కనీసం మనం ఫోన్ చేసి పలకరించినా కూడా సరిగా మాట్లాడకుండా మనసులో ఏదో పెట్టుకుని మాటలతో దెప్పిపొడవడం...అన్ని తెలిసి కూడా....!! వాళ్ళ ఇంటికి వెళ్లావు మా ఇంటికి రాలేదు...ఎవరో ఏదో చెప్తే నమ్మడం మాటలతో బాధ పెట్టడం...!! వయసుకు పెద్దవాళ్ళే కాని పలకరించినప్పుడు కనీసం దూరం నుంచి ఫోన్ చేసారు అని కూడా వుండదు ఏదేదో మాట్లాడుతూ వుంటారు...!!
ఏం చేస్తాం వాళ్ళ ఖర్మ అనుకోవాలో....లేక ఆ పై పై మాటల ప్రేమకు మోసపోయిన మన ఖర్మ అనుకోవాలో....!!
మనిషి తో మనిషి కి అవసరం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు....డబ్బుతో అన్ని కొనలేము...అమెరికాలో ఉన్నా అండమాన్లో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా....!!
బంధాన్ని పెంచుకోవడం...కష్టం తుంచుకోవడం క్షణకాలం....!! ఆత్మీయతను పెంచుకోవాలి కాని నాకు నేను చాలు.. నాకు నా కుటుంబం చాలు అనుకోకూడదు...మనం బావుండాలి అందరితో మనం బావుండాలి...మనతో అందరు బావుండాలి....!! అందుకే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కనీసం అప్పుడప్పుడూ అయినా మీ అనుకున్న అనుబంధాల్ని కాస్త పలకరిస్తూ ఉండండి...!! -:)

15, నవంబర్ 2012, గురువారం

తెలియని సమాధానం....!!


అంధకారంలో పడిన మనసుకి
అక్షరాల ఆకారం ఆడ మరచిపోతే....!!

అక్షరాలతో అల్లిన పదాల అమరిక
కనిపించక పోవడంలో వింత ఏముంది....!!

ఎదురుగా ఉన్న నిన్నే చూడలేనప్పుడు...
ఏకాంతంలో నీతోనే ఉన్నానని చెప్పినా వ్యర్ధమే కదూ...!!

అర్ధం కాని ఆవేశం నీ కోసమే...అంటూ...
అటు ఇటు పోతూ...నీకు దూరంగా జరిగితే...!!

ఎనలేని ఇష్టమంటూ నువ్వెళితే...
ఎక్కడో నీ కోసం నే వెదుకుతున్నానంటే....!!

అయినా ఇష్టం పోదెందుకో మరి....!!

12, నవంబర్ 2012, సోమవారం

దీపావళి శుభాకాంక్షలు

 చిరు దివ్వెల దీపావళి
ఇంటింటా నింపాలి....
ఎనలేని కాంతుల దివ్య శోభలు...
ప్రతి మది నిండాలి సంతోషపు
చిరు జల్లుల ఆనందంతో.....

          అందరికి దీపావళి శుభాకాంక్షలు

11, నవంబర్ 2012, ఆదివారం

అలా ఉండటం సాధ్యమా.!!





ఇరవైల్లో...అరవైల్లా...ఉండటం సాధ్యమా.!!

             లేక

అరవైల్లో...ఇరవైల్లా...ఉండటం గొప్పతనమా...!!

మీకెలా అనిపిస్తుందో చెప్పరూ ....!!

10, నవంబర్ 2012, శనివారం

మీ హోదాకి తగరని....!!

ఎప్పుడో ఇంటరు చదివినప్పటి సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది....మా శైల అక్క పెళ్లి కి వెళితే....వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లెండి...అక్క అంటే చాలా ఇష్టం నాకు..వాళ్ళ అత్త కూతుర్లు ముగ్గరు....ఆఖరి అమ్మాయి నా  వయసే కాకపొతే వాళ్ళు సిటిల్లో పెరిగిన స్టైల్...అంతా హై లెవెల్...మనమేమో పక్కా పల్లెటూరి పిల్లలమాయే..!!
పెళ్లి తెల్లవారు ఝామున...అప్పట్లోనే రిసెప్షన్ పెట్టారు మనకేమో కొత్తాయే...!! పెళ్లి అంటే అంతా హడావిడి అందులోనూ ఇష్టమైన అక్క పెళ్లి...అక్క కూడా అస్సలు వదల కుండా తనతోనే ఉంచుకుంది...అక్కకి కూడా ఇష్టమే నేనంటే...!!మరి మనకి పెత్తనం చెయ్యాలని వుంటుంది కదా..!! మనకేమో డబ్బులు...స్టైల్...ఈ గొడవలు తెలియదు...కనీసం పట్టులంగా కూడా వేసుకోలేదు....అయినా రిసెప్షన్ లో నేను వుంటానంటే...వాళ్ళేమో వద్దని...మొత్తానికి నేను కాసేపు పెత్తనం చేసి మళ్లి అక్క దగ్గరకి వెళిపోయాను....అప్పుడు తెలియదు..వాళ్ళు లెవెల్ కోసం చూసుకుంటున్నారు అని...డబ్బులకి పై పై మెరుగులకి విలువ ఇస్తున్నారు అని అర్ధం చేసుకునే అంత తెలివి లేదు....!!
ఎందుకో గుర్తు వచ్చింది వాళ్ళ ఆనాటి ప్రవర్తన.....మనిషి కి మనసు కి విలువ ఇవ్వండి దయచేసి డబ్బుకి పై పై మెరుగులకి ఇవ్వకండి....డబ్బు లేనంత మాత్రాన....పల్లెటూరు వాళ్ళు అయినంత మాత్రాన మీ హోదాకి తగరని ఎదుటివారిని చిన్నబుచ్చకండి....!!

9, నవంబర్ 2012, శుక్రవారం

మనసు అలజడి ఎందుకో...!!

కలలు అలలై వెల్లువెత్తితే...
ఎగసి పడే కెరటాలు....
జోరుగా హోరుమంటుంటే....
ప్రళయంలో ప్రకృతి విలయంలో...
విల విలలాడుతున్న తరుణంలో....
ఒక్కసారిగా ప్రశాంతత....!!
ఎలా సాధ్యం...??
ప్రాణం పోయే తరుణంలోనూ....
నీ ఆలాపనే....!!
నీ పైన ఆరాధనే....!!
ఎందుకో మరి...!!
ఈ మనసు ఆరాటం...!!
దేనికో మరి ఈ ఒంటరి పోరాటం..!!

8, నవంబర్ 2012, గురువారం

ఎవరు....??

వద్దన్నా వదలనంటోంది
రావద్దన్నా వెంట రాక మాననంటోంది
పొమ్మన్నా వదలి పోనంటోంది
కోపంలో బాధలో నాతోనే వుంది
నా ఆనందంలో నా వేదనలో
నాతోనే తానుంది....!!
నిన్నుచేరే నిమిషంలో.....మాయమైంది...!!
ఎక్కడా అని చూస్తే...!!
పక్కనే ఉన్న నువ్వా...!!
లేక నాతోనే ఉన్న నీ జ్ఞాపకమా...!!

6, నవంబర్ 2012, మంగళవారం

నిరీక్షణలో నీ కోసం...!!


మూగబోయిన మనసు లోగిలి
మౌన తటాకమైన క్షణం...!!
నీ రాక కోసం ఎదురు చూసి చూసి...
బోసిబోయిన వీధి వాకిలి...!!
నువ్వు వచ్చే క్షణం కోసం
నిరీక్షిస్తూ....నిరీక్షణలో నీ కోసం...!!



5, నవంబర్ 2012, సోమవారం

సినిమాల గొడవలు.....

ఏంటో ఈ మధ్య సినిమాల కన్నా వాటి మీద ఏదో ఒక గొడవ ఎక్కువైపోయింది...ఆ పాట నాదని ఒకరు.....ఈ సినిమా కధ నాదని మరొకరు....అదిగో మమ్మల్ని తక్కువ చేసారని ఒక వర్గం...ఇదిగో మమ్మల్ని తిట్టారని ఇంకొకరు...మమ్మల్ని రౌడీలు అన్నారని ఒకరు...మేము మాత్రమే ఫ్యాక్షనిస్టులమా అని ఇంకొకరు....ఫలానా సీనులో మమ్మల్ని కించపర్చారు...ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి....!!
హాస్యం అనేది అలానే వుండాలి కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు...బోలెడు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ పడి తీసే సినిమా ఆహ్లాదంగా వుండాలి...కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు....!!
ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే....సినిమాని వినోద ప్రధానంగానో....లేదా ఒక మంచి విషయాన్ని చెప్పే మాధ్యమం గానో...చూడాలని నా విన్నపం..సినిమాలలో వినోదం కోసమో....కాసేపు నవ్వు కోవడం కోసమో...కొన్ని సన్నివేశాలు తీసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా..!! మంచి చెడు అందరిలోనూ వుంటాయి...అన్ని వర్గాలలోను..ప్రాంతాలలోను...మంచి చెడు వుంటుంది...వేషం...భాష...పద్దతులు...ఇలా అన్ని ఒక్కలా వుండవు కదా..అందరివి...!! మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒకలా లేనప్పుడు....ఒక అమ్మ కడుపున పుట్టిన పది మంది ఒకలా లేనప్పుడు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు వర్గాల వాళ్ళు ఒకలా ఎలా వుంటారు....??
మరీ ఈ మధ్యనే ఈ సినిమాల గొడవలు ఎక్కువై పోతున్నాయి....అందరికి మేలు జరిగే సమస్యలపై దృష్టి పెడితే....బావుంటుంది...!!

3, నవంబర్ 2012, శనివారం

మార్పు..!!

పుస్తకాలు చదివినంత మాత్రాన కాని..వార్తలు చూసినంతనే కాని..ఉత్తరాలు చదివినంత మాత్రాన జనాలు మారతారా...!! అంటే ఏమో తెలియదు కాని ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం లో ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ మూడు వుండేది...కొత్తగా వచ్చిన శివారెడ్డి ఆ క్లాసు తీసుకునేవారు. ఒక రోజు పరీక్ష పెడితే ముందుగా నేనే రాయకుండా బయటికి వెళిపోయాను...నా తరువాత చాలా మంది వచ్చేసారు...అందరివి పేర్లు ఆయన నోట్ చేసుకున్నారనుకుంటా..!! ఫైనల్ ఎగ్జామ్స్ లో ప్రాక్టికల్స్  లో ఆ లాబ్ లో వరుసగా క్లాసు లో పరీక్ష రాయని  అందరిని  ఎదో ఒక వంక పెట్టి ఫెయిల్ చేస్తున్నారు...ఇక నా వంతు వచ్చింది....నేను సర్క్యూట్స్ కాని, రీడింగ్స్ కాని కరక్ట్ గా వుంటాను....కాక పొతే ఇక్కడ ఏమైందంటే...ముందు మనకి వచ్చిన దానికి సర్క్యూట్స్ , టేబుల్స్, ఫార్ములా వేసి సార్ కి చూపించి  కరక్ట్ అంటే మిగిలినది చేయాలి...అందుకని ముందు వేసి చూపిస్తే...రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో అన్నారు....సరిగానే వేసా కదా ఇలా అంటున్నారేంటా అని నాకు డౌట్ వచ్చి మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళి వేరేది వేసి చూపించా..!! ఉచ్ ఒన్ యు వాంట్ టు డు..డు  ఇట్ అన్నారు...మళ్ళి  వెంటనే వైవా కి రమ్మని పిలిచారు...అడిగి పంపేసారు....ఆ రోజు హాస్టల్ కి వచ్చేసాక ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేసాను...తెలుగులోనే సుమా రాసింది...ఆయనకు తెలుగు చదవడం రాదనుకుంటా..!! వాళ్ళ ఫ్రెండ్ తో చదివించుకున్నట్లు వున్నారు....!!
మరుసటి రోజు నా ఫ్రెండ్ తమిళ్ అమ్మాయి లాబ్ ఎగ్జామ్ కి వెళితే....తనకి బాగా హెల్ప్ చేసారంట...మొహం బాగా చిన్నబోయి వుంది మంజు నాకు మాత్రమె కాదు అందరికి చాలా బాగా హెల్ప్ చేసారు ఈ రోజు అని చెప్పింది...హాస్టల్ కి రాగానే...ఇప్పట్లా అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండీ వెంటనే చెప్పడానికి....!!
అలా మొత్తానికి అప్పుడు నా లాబ్ పోయింది....తరువాత వెళ్ళినప్పుడు ఆ సారే చాలా చక్కగా మాట్లాడారు లాబ్ లో....అప్పుడు నేను కుడా ముందు ఏమి అడగలేదు మొత్తం చేసి ఫైనల్ గా చూపించాను....మద్యలో వచ్చినా..నా పని నేను చేసుకున్నాను..తప్ప ఏమి అడగలేదు...!! వైవా కుడా బాగానే అడిగి పంపేసారు....!!
ఉహించని మార్పు అది...!!   ఇలాంటివి ఇంకా కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా...!!

మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకసారి తప్పుని ఒప్పుకుని కాస్త మారితే...చాలా ఇబ్బందులు తప్పుతాయి అందరికి...!! నాకు అన్ని తెలుసు వీళ్ళ మాట నేనెందుకు వినాలి అని కాకుండా తప్పు ఎక్కడ వుంది అని కాస్త తరచి చూసి మార్చుకుంటే...అందరు మంచివారే....!!  

1, నవంబర్ 2012, గురువారం

అభినందనలు చిరంజీవి గారు





మొత్తానికి ముఖ్యమంత్రి ఇప్పుడు కాలేక పోయినా ఎన్ని సార్లో మేడం పిలిచి పిలిచి తిప్పి పంపినా ఓపికగా ఎదురు చూసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది చిరజీవి గారికి....మొత్తానికి...!!
-:) అభినందనలు చిరంజీవి గారు మీ ఓపికకి ....!!  

31, అక్టోబర్ 2012, బుధవారం

ఏదో తెలియని బాంధవ్యం....!!

కదిలి పోతున్న కాలంతో పాటుగా...
నేను..నాతోపాటుగా...నువ్వు...!!
గాలి వాటంగా సాగే జనాలు మనతో పాటు...!!

వదలి పోనని మారాము చేసే జ్ఞాపకాలు...
సుతిమెత్తగా తాకే సుకుమార కుసుమాలు...!!
చివరి వరకు వెంట ఉండే పరిమళాలు....!!

సంద్రంలో అలజడి ఏంటో...!!
ఆకాశం వర్షించడం ఏంటో....!!
కలవని రెండు అంతరాల మధ్య....
ఏదో తెలియని బాంధవ్యం....!!

అచ్చంగా మనలానే కదూ...!!

30, అక్టోబర్ 2012, మంగళవారం

పదవీ విరమణ పండుగ....!!

ఎంతగా అనుకున్నానో.....వెళ్ళాలని....కాని వెళ్ళలేక పోతున్నాను ...నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీలత టీచర్ గారి రిటైర్మెంట్ పండుగకు....చాలా బాధగా వుంది...ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ రమ్మని పిలిచినా వెళ్ళలేని పరిస్థితి..... ఒక్కోసారి అంతే..మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము....
టీచర్ గారు పాటలు బాగా పాడే వారు పెద్ద పుస్తకంలో బోలెడు పాటలు ఉండేవి.... డాన్సు కుడా బాగా నేర్పించేవారు. ఒకసారి పాటల పోటికి వెళ్తానంటే నాకు నచ్చిన పాటను నేర్పించి పంపారు...కాక పొతే నాకు బహుమతి రాలేదనుకోండి....అక్కడా రాజకీయాలే కదా....!! అయినా నాకన్నా బాగా పాడారులెండి...-:)...!!
మేము కొంత మందిమి టీచర్ గారి దగ్గరే పడుకునే వాళ్ళము..అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం అలా చూసిందే గోపాలరావు గారి అమ్మాయి......మిలటరీ హోటల్ లో బిరియాని భలే వుండేది...ఎప్పుడన్నా తినేవాళ్ళం..!! కృష్ణాష్టమికి  కృష్ణుడిని భలే అలంకరించి పూజలు చేసే వాళ్ళం...పెద్ద కృష్ణుడి బొమ్మ వుండేది ఆవిడ దగ్గర...!!
తరువాత కూడా...చాలా రోజులకి టీచర్ గారి దగ్గరకు వెళ్తే  అచ్చం మా అమ్మాయి కూడా   నీ లానే  అల్లరి చేస్తోంది అని ముద్దుగా తిట్టారు....ఆ మద్య చిన్నప్పటి నేస్తాలు అందరమూ కలిసినప్పుడు టీచర్స్ అందరిని కూడా  పిలిచి మాకు తోచినట్లుగా గౌరవించాము....ఆరోజు నన్ను ఎప్పుడు చూస్తానా అని వుందని అందరితో అన్నప్పుడు భలే సంతోషం వేసింది...
ఎందరినో....మంచిగా తీర్చిదిద్దిన మా శ్రీలత గారు మళ్లి జన్మలో కూడా టీచర్ గానే పుట్టాలని వుందని మాలాంటి వారే తనకు శిష్యులుగా కావాలని చెప్పారు....మేమందరం(విద్యార్ధులు) తన ఆస్థి అని గొప్పగా చెప్పుకున్నారు....ఇంతకన్నా మాకు మాత్రం ఏం కావాలి...
రేపు పదవీ విరమణ చేస్తున్న ప్రియాతి ప్రియమైన శ్రీలత టీచర్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇంకా మాలాంటి ఎందరినో తయారు చేయాలని ఎప్పటికి మీ చిరునవ్వు అలానే వుండాలని కోరుకుంటూ ప్రేమతో....మీ ప్రియ శిష్యురాలు                                                                                                                                                          

29, అక్టోబర్ 2012, సోమవారం

నేను - అహం - దేవుడు

కొందరికి నేను  అన్న అహం చాలా ఎక్కువగా వుంటుంది....
కొందరేముంది అందరమూ అనుకుంటాము...నాకు నేను గొప్ప అని అది మామూలు విష్యం.
కాకపొతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలా కొద్ది మందికి నేను అన్న అహంకారం అహంతో మిళితమై పోయి ఉంటుంది...మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!!
దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!!

గుడికి వెళ్లి వచ్చినంత మాత్రాన మనం పవిత్రులమై పోము...వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం కాము...ఎన్ని సార్లు గుడికి వెళ్ళాము అని కాదు ఎంత బాగా దేవుని దర్శించుకున్నాము...మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాము..మనం చేసే పని వల్ల కాని, మన మాటల వల్ల కాని ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధ పడుతున్నారేమో అని మాత్రం ఆలోచించం...వయసు తో పాటు కొంత మందికి బుద్ది పెరుగుతుంది...మరి కొంతమందికేమో...మందగిస్తుంది....!! మన గొప్ప మనం డబ్బా కొట్టుకుంటే ఎలా..!! నలుగురూ డప్పు కొడితే...బావుంటుంది కదూ..!!

నా వరకు నేను అనుకుంటాను నేను చాలా బాగా నా బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తున్నానని...కాని లోటుపాటులు ఎన్ని వున్నాయో....నాకు తెలియదు కదా...!! బాధితులకు తెలుస్తుంది...!! కాకపొతే ఏంటంటే...ఈ రోజుల్లో అన్ని బంధాలు బాధ్యతలు డబ్బుతో మాత్రమె ముడి పడి వున్నాయి...అది ఏ బంధమైనా కానివ్వండి..డబ్బే మూలం...!!
అయినా దేవుడే అందరికి మంచివాడు కాదు..అలాంటప్పుడు మనం మాత్రం ఎంత వరకు మంచిని డబ్బిచ్చి కొనుక్కోగం చెప్పండి..?? -:)
పుడుతూ ఏమి తీసుకురాము...పోతూ ఏమీ తీసుకువెళ్ళలేము...అయినా ఎందుకో అహాన్ని వీడలేము...అదే మన బలహినతేమో..!! మహాత్ములకు మనకు మధ్య తేడా అదే కదా...-:)...!!

గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు కోపం తెచ్చుకోకండి ఎవరూ...!!
కాస్త ఆలోచించండి అంతే..!!

28, అక్టోబర్ 2012, ఆదివారం

బతుకు పయనానికి....అన్వేషణ.

ఆట ఆట దేవుడు మనతో ఆడే ఆట
పరుగు పరుగు కాలంతో పరుగు
ముడి ముడి జీవితంతో ముడి
జీవితం జీవితం ప్రతి క్షణం పోరాటం

ఆటలో ఓడినా  పరుగు ఆపినా
ముడి విడిపోయినా జీవితంలో....
మిగిలేది ఓటమే...ఒంటరితనమే...!!
దైవం ఆడే చదరంగంలో...గెలుపోటములు
దైవాధీనాలే....!!

అయినా పోరాటం తప్పదు....జానెడు పొట్టకు...
బతుకు పయనానికి....కాలంతో...పరుగు...!!

గులక రాళ్ళున్నా...గులాబి ముల్లు గుచ్చుకున్నా...
మల్లెల సౌరభానికి ఎంత దూరమైనా....
పయనాన్ని సాగిస్తాం...రేపటి మీద ఆశతో...
ఈ రోజు నిరాశని మర్చిపోయి...!!
ఇదే సగటు మనిషి జీవన విధానం.!! 

పుట్టినరోజు పాపాయి.....!!

         ప్రియాతి ప్రియమైన ప్రియకు
           పుట్టినరోజు శుభాకాంక్షలు          
                       ప్రేమతో
                    అమ్మ  నాన్న 
              నాయనమ్మ  తాతయ్య
             అత్త   సుబ్బారావు తాత
               పెదనాన్న మంజమ్మ
                 మౌర్య  శౌర్య  తేజ 

26, అక్టోబర్ 2012, శుక్రవారం

న్యాయ పీఠాధిపతి

ఓ  మరణం మరో పుట్టుకకి నాంది
రెప్ప మూస్తే మరణం రెప్ప తెరిస్తే జననం
రెంటికి తేడా రెప్పపాటే...!! సారూప్యం ఏడుపే....!!
పుడుతూ ఏడుస్తాం...పోతూ....ఏడిపిస్తాం...!!
కోపం..ద్వేషం..ఇష్టం..కష్టం...అన్నీ...
ఈ రెప్పపాటు జీవితం కోసమే...!!
ఎవరైనా తల  వంచాల్సింది చావు ముందే...!!
వయసు తో పని లేదు...గొప్పా  బీదా తేడా లేదు
అందరూ సమానమే...అందరికి సమ న్యాయమే..!!
సరియైన న్యాయ పీఠాధిపతి  మరణమే...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner