7, ఏప్రిల్ 2012, శనివారం

నువ్వు లేని నా ప్రపంచం...!!


బంగరు తల్లి....!!
ఈ లోకంలోకి రాలేని నీది అదృష్టమో... !! రానివ్వలేక పోయిన మాది దురదృష్టమో...!! ఏమో మరి ఏది తెలియని ఈ ఆట..!! నువ్వు వస్తావేమో అని ఆశగా చూసాను కాని మళ్ళి ఆ క్షణంలోనే భయం..!! అందుకే నువ్వు కాకుండా వుంటే....ఈ లోకంలోకి రాకుండా వుంటే..ఆడపిల్లగా పుట్టకుండా వుంటే..ఏ కష్టము తెలియకుండా హాయిగా వుంటావన్న చిన్న ఆశతో...ఎంతో ఇష్టమైన నిన్ను ఆమ్మాయి గా కాకుంటే అనుకుంటే...!! అందుకేనేమో ఆ దేవుడు కుడా నిన్ను ఆడపిల్లగా పుట్టించలేదు నా మొర విని..!! అలా అనుకోవడంలో నా స్వార్ధం కూడా వుంది అది కూడా నువ్వు కష్టపడకూడదన్న ఆలోచన... నీ నుంచి నన్ను దూరం చేసింది...నువ్వు లేని లోటు తీరనిదే కాని భరించక తప్పదు...!! నీతోనే చుట్టుకున్న నా ఆనందం...నా చిన్ని ప్రపంచం నువ్వు లేక బోసిపోయింది..!! నీ కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే వుంటుంది నా మనసు ఈ జన్మకి...!! నా ఆలోచన తప్పేనేమో నన్ను క్షమించు బంగరు తల్లి...!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Wonder full

జలతారు వెన్నెల చెప్పారు...

మీ కవిత చాలా బాగుంది మంజు గారు.
మనం ప్రాణంగా పెంచుకుంటాము కదా.. కష్ట్టమేమి ఉండదండి.అమ్మాయి కష్ట్టపడకుండా అమ్మా, నాన్నని ఇచ్చాడు కదా భగవంతుడు..

చెప్పాలంటే...... చెప్పారు...

అమ్మ, నాన్న వున్నా తరువాత జీవితమే కదా.....ఐయినా మనం పడే బాధలు ఎందుకులే అనిపించింది ఆ క్షణంలో....అందుకే అలా అనుకున్నాను..:)

థాంక్యు వనజ గారు , వెన్నెల

ఆలోచించే చెప్పారు...

అమ్మా మంజులా దేవీ! అన్ని కష్టాలూ ఆడ పిల్లలకేనా? మగ పిల్లల కేమీ వుండవా?

ఆలోచించే చెప్పారు...

ఏమీ అనుకోక పోతే ఒక సలహా.రమణ కూతుర్ని పెంచుకో..

చెప్పాలంటే...... చెప్పారు...

పెంచుకుంటే నా కూతురు అవదు కదా అయినా అలా ఇబ్బందులు తెలియకుండాలనే అమ్మాయిగా వద్దు అనుకున్నది. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలకు ... కదా!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner