10, నవంబర్ 2012, శనివారం

మీ హోదాకి తగరని....!!

ఎప్పుడో ఇంటరు చదివినప్పటి సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది....మా శైల అక్క పెళ్లి కి వెళితే....వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లెండి...అక్క అంటే చాలా ఇష్టం నాకు..వాళ్ళ అత్త కూతుర్లు ముగ్గరు....ఆఖరి అమ్మాయి నా  వయసే కాకపొతే వాళ్ళు సిటిల్లో పెరిగిన స్టైల్...అంతా హై లెవెల్...మనమేమో పక్కా పల్లెటూరి పిల్లలమాయే..!!
పెళ్లి తెల్లవారు ఝామున...అప్పట్లోనే రిసెప్షన్ పెట్టారు మనకేమో కొత్తాయే...!! పెళ్లి అంటే అంతా హడావిడి అందులోనూ ఇష్టమైన అక్క పెళ్లి...అక్క కూడా అస్సలు వదల కుండా తనతోనే ఉంచుకుంది...అక్కకి కూడా ఇష్టమే నేనంటే...!!మరి మనకి పెత్తనం చెయ్యాలని వుంటుంది కదా..!! మనకేమో డబ్బులు...స్టైల్...ఈ గొడవలు తెలియదు...కనీసం పట్టులంగా కూడా వేసుకోలేదు....అయినా రిసెప్షన్ లో నేను వుంటానంటే...వాళ్ళేమో వద్దని...మొత్తానికి నేను కాసేపు పెత్తనం చేసి మళ్లి అక్క దగ్గరకి వెళిపోయాను....అప్పుడు తెలియదు..వాళ్ళు లెవెల్ కోసం చూసుకుంటున్నారు అని...డబ్బులకి పై పై మెరుగులకి విలువ ఇస్తున్నారు అని అర్ధం చేసుకునే అంత తెలివి లేదు....!!
ఎందుకో గుర్తు వచ్చింది వాళ్ళ ఆనాటి ప్రవర్తన.....మనిషి కి మనసు కి విలువ ఇవ్వండి దయచేసి డబ్బుకి పై పై మెరుగులకి ఇవ్వకండి....డబ్బు లేనంత మాత్రాన....పల్లెటూరు వాళ్ళు అయినంత మాత్రాన మీ హోదాకి తగరని ఎదుటివారిని చిన్నబుచ్చకండి....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు. మీరు చెప్పినది నిజమే ! పట్టు చీరని చూసి పీట వేసారంటారే ..అలా అన్నమాట.

మీరు ఇపుడు కూడా అలా ఫీల్ అవుతున్నారా!? నూటికి తొంబై తోమ్మిది శాతం అలాగే ఉన్నారు.

కేవలం డబ్బు వలెనే అన్ని విలువలు రావండి. అసి అందరు తెలుసుకుంటే బాగుండును

అయినా మన విజయవాడ పల్లెటూరా..!? :)

చెప్పాలంటే...... చెప్పారు...

అప్పుడు విజయవాడ లో లేము ఐయినా పల్లెటూరి వాళ్ళంటే చులకన లెండి.....ఫీల్ కావడానికి అప్పుడే పట్టించుకోలేదు వాళ్ళని.....అలాంటి వాళ్ళని పట్టించుకుని మనం బాధ పడటం అంత అవసరం అంటారా వనజ గారు....డబ్బులతో అన్ని రావని తెలియకపోతే....అది వాళ్ళ ఖర్మ...!!
థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner