24, నవంబర్ 2012, శనివారం

బడా మోసాలు మాయలు

ఏంటో ఈ జీవితం అనిపించేస్తోంది ఒక్కోసారి....!!
చదువు, పెళ్లి, ఉద్యోగం, బాధ్యతలు, బరువులు....ఎదురు మాటలు పడటం తప్ప తిరిగి చూసుకుంటే ఏమి కనిపించడం లేదు....అంతా ఖాళీగా అనిపిస్తోంది....!!
పెళ్లి తో మనిషి నైజం కాస్త అర్ధం అయితే....అది పోను పోనూ మానవ నైజం అంతే....అని నిరూపిస్తోంది.
నమ్మకంతో మోసం చేసే వాళ్ళు, మాటలు తీయగా చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు, వాళ్ళ స్వార్ధం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడని వాళ్ళు....ఇలా ఎన్నో ఆటుపోట్లు....!!
మద్యలో డబ్బుల మొహం చూసిన వాళ్ళు ప్రపంచం లో అది తప్ప ఇంక ఏది ముఖ్యం కాదు అనుకుంటారు...!!
ఈ రోజుల్లో మనం చూస్తున్న మోసాల్లో కార్పోరేట్ కంపెనీల ఘరానా మోసాలు అందరికి తెలిసినవే....!!
వాళ్ళు మాత్రం బానే దాచుకుంటారు జనాలకి జీతాలు మాత్రం ఎగ్గొడతారు...
నలుగురైదుగురు కలిసి కంపెని పెడతారు...ఆ రికమండేషన్ ఈ రికమండేషన్ అంటూ వాళ్ళ వాళ్ళ చుట్టాలకి పక్కాలకి మంచి పొజిషన్లు ఇస్తారు ఏమి తెలియక పోయినా....ఏమి చేయక పోయినా అది చేసారు ఇది చేసారు అని హైకులు బాగా ఇస్తారు..వాళ్లకి అడ్డం వచ్చిన వాళ్లకి మొండి చేయి చూపిస్తారు...వాళ్ళు  చేసే మోసాలు మిగిలిన పార్టనర్స్  కి తెలియకుండా ఉండటానికి ఎన్నో జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేస్తూ మాయ చేస్తూ నిజాన్ని కప్పేస్తారు....సదరు అధికారి కళ్ళు తెరిచి చూసే సరికి ఏముంటుంది ఐపి పెట్టి మాయమవడం తప్ప...!!
హైదరాబాద్ లో అమెరికాలో పెద్ద పేరున్న కంపెనీలో పని చేసినప్పుడు మన పని మనం చేసుకు పోతున్నాము కదా అనుకుంటే ఓ మహానుభావుడి వల్ల తిట్టడం తెలియకుండా తిట్టడం అంటే ఏమిటో తెలుసుకున్నాను....మరో పున్యాత్ముడి వల్ల మాటలు కోటలు దాటుతాయి కాని ఉపయోగం వుండదు అని తెలిసింది....మరో బాబు తెలిసిన వాళ్లకి నచ్చితే ఉద్యోగం ఇవ్వండి అంటే బాగా.....ఇంటర్వు చేసినట్లు నటించి అప్లికేషన్ మీ దగ్గరే ఉంచండి క్లయింట్ ఓ..కే చేయగానే జాబ్ ఆపర్ పంపిస్తాము....అని...అసలు కారెక్టర్ ఇంకోటుంది నేను అసలు ఆయనా బాగా......క్లోజ్ వాళ్ళ చుట్టాల కన్నా అన్ని నాతోనే పంచుకుంటారు...ఎవరు ఏది చెప్పినా నాకు చెప్పి కాని చేయరు....అంతా నేనే అన్నట్లు..!!
నిజం గా అక్కడ పని చేసినన్నాళ్లు అనిపించింది రాజకీయనాయకులకు మంచి ట్రైనింగ్ దొరుకుతుంది ఇక్కడ పని చేస్తే....వర్క్ మాట ఏమో కాని నటన, కుళ్ళు , కుతంత్రాలు బాగా తెలుస్తాయి అని...!!
చివరికి అసలు మనిషి కూడా వాళ్ళతో చేరి అందరిని మోసం చేసాడు...
డబ్బు పొతే సంపాదించుకోగలం....మాటా మంచి పొతే ఎంత బతుకు బతికినా శవంతో....సమానమే...!!
రాజకీయ నాయకులు కనీసం ఓటు కోసమైనా జనం దగ్గరికి వస్తారు ఎన్నికలప్పుడు....మరి ఈ కార్పోరేట్ కంపెనీల బారిన పది మోసపోతున్న జనాలకు న్యాయం జరిగేదేలా...??

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భాస్కర్ కె చెప్పారు...

తగినంత జాగ్రత్తగా వుండటమేమోనండి,. మనం చేయవలసింది.

చెప్పాలంటే...... చెప్పారు...

అవును భాస్కర్ గారు..అయినా నమ్ముతూనే ఉంటాము వాళ్ళు మోసం చేస్తూనే వుంటారు

వాసుదేవ్ చెప్పారు...

మీ బ్లాగ్ చూసాను...గందరగోళంగా, అర్ధంకాని రాతలు లేకుండా హాయిగా నిజాయితీగా ఉంది.మీరు చెప్పదల్చుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పటం నచ్చింది. ముఖ్యంగా ఇలాంటి టపాలు ఆలోచింపచేస్తాయి..అభినందనలు

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషమండి వాసుదేవ్ గారు,
మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు..నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నది రాస్తూ ఉంటాను..ధన్యవాదాలు మీకు నా బ్లాగు టపాలు నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner