27, డిసెంబర్ 2012, గురువారం

మనం ఎలా ఉంటున్నాం...!!

సినిమాలు చూస్తాము...పుస్తకాలు చదువుతాము...టి వి లో అన్ని చూస్తాము...కనపడిన వాళ్ళతో కబుర్లు చెప్తాము...వాళ్ళు అలా ఉన్నారు...వీళ్ళు ఇలా ఉన్నారు...అని మనకు నోటికి వచ్చిన మాటలు చెప్తాము....నీతులు బోలెడు చెప్తాము వినే వాళ్ళు ఉండాలి కాని....కాకపొతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోము...ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం..మనం మాత్రమే మంచి వాళ్ళమని....!!
వంద నీతులు చెప్తే కనీసం ఒక్కదాన్ని కూడా మనం పాటించాలనుకోము...మరి ఇదెక్కడి న్యాయమో...!! ఎవరో అన్నట్లు నీతులు పక్కవాడికి చెప్పడానికే అని...!! ఒక వేలు ఎదుటి వాడికి చూపిస్తే మన నాలుగు వేళ్ళు మన వేపే చూపిస్తాయి..కాకపొతే మనకు అర్ధమయి చావదు..!!
కోపాలతో....ద్వేషాలతో..మోసాలతో...అసూయతొ...నిండి పోయింది ఇప్పటి ప్రపంచం.....ఏ బంధమూ...బందుత్వము అక్కరలేదు...మనం బాగున్నామని అనుకోవడానికి ఏం చేయాలా...ఎవరిని బోల్తా కొట్టించాలా...!! అన్న ఆలోచన లోనే మూడువంతుల జీవితాన్ని కానిచ్చేస్తున్నాము...నటనలో మనం అందరి కన్నా ముందే ఉంటున్నాము...మనతో కూడా మనం నటిస్తున్నాం కదా..!! నటనలో మాత్రం పరిపూర్ణంగా జీవిస్తున్నాము....ఈ జీవితంలో...!!
గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలుగుతున్నామా...!! కనీసం ఒక్క నిమిషం అయినా శాంతిగా సంతోషంగా ఉండగలుగుతున్నామా...!! అలా లేనప్పుడు ఈ సంపాదనలెందుకో...!! ఈ నటనలెందుకో....!! కాకిలా కలకాలం బతికే కంటే...హంసలా అర నిమిషం బతికినా....చాలు...!! క్షణికావేశం లో అరిషడ్వర్గాలు మన మీద పెత్తనం చెలాయిస్తాయి...వాటికి మనం బానిసలం...అందుకే కొందరు మాత్రమే మహనీయులు....మనం మామూలు మనుష్యులం.....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

G.P.V.Prasad చెప్పారు...

నేను కొంతలో కొంత పాటిస్తాను.

చెప్పాలంటే...... చెప్పారు...

చెప్పే వాటిలో కొన్ని అయినా పాటిస్తునందుకు సంతోషం ఫణీంద్ర గారు....మీ స్పందనకు ధన్యవాదాలు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner