22, జనవరి 2013, మంగళవారం

ఇప్పటికి ఎప్పటికి.....!!

పిలిస్తే పారిపోతావు
పిలవకపోతే పక్కనే ఉంటావు 
పలకరిస్తే పలకనంటావు
పలక్కపోతే అలుగుతావు 
రమ్మంటే రానంటావు
వద్దంటే పోనంటావు 
మాటాడమంటే మాటాడనంటావు
మాటలొద్దంటే మాటాడుతూనే ఉంటావు
అల్లరొద్దంటే అల్లరి చేస్తూ అలుకలు బోతావు
అల్లరి చేయమంటే సడి సేయక వడిలో వాలతావు
పెద్దైనా పసితనపు చాయలు అమ్మ దగ్గర
ఇప్పటికి ఎప్పటికి పసితనమే....అందరికి...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రాజి చెప్పారు...

నిజంగానే... "అమ్మ దగ్గర
ఇప్పటికి ఎప్పటికి పసితనమే....అందరికి...!!"

చెప్పాలంటే...... చెప్పారు...

అవును కదా రాజి :) థాంక్యు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner