20, ఫిబ్రవరి 2013, బుధవారం

అర్ధాల్ని మార్చేస్తున్న పెళ్ళిళ్ళు....!!

హా...!! నా సొమ్మేం పోయింది పెళ్ళి చేస్తే చేసుకుంటాను...నాకు నచ్చక పొతే ఏమైంది..??  ఇంట్లో వాళ్ళ మాట కాదన్నానని నాకెందుకు పేరు...!! తరువాత నచ్చలేదని గొడవ చేస్తే సరిపోతుంది...!! అటు నా పని అవుతుంది...ఇటు ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు మంచితనం ఉంటుంది...అన్ని మద్యలో సంబంధం చూసిన వాళ్ళ మీదకు నెట్టడంతో నాకు సమస్య తీరుతుంది ఇప్పటి వరకు అందరికి వాళ్ళ మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది....ఒక దెబ్బకు రెండు పిట్టలు....అని ఫోటో చూసి అమ్మానాన్న ఇష్టం అని చెప్పి అతి వినయంగా పెళ్ళిపీటల మీద కూర్చుని...పెళ్ళి అయిన క్షణం నుంచే ఇరు పక్షాల వాళ్లకి చుక్కలు చూపించి...పెళ్ళి పెటాకులు చేయడానికి చేయగలిగిన అన్ని పనులు చేసి...నాణానికి ఒక వైపు మాత్రమే చూపి అందరిని కళ్ళున్న గుడ్డివాళ్ళను చేసి డబ్బు హోదా కోసం మాత్రమే చూసుకుని అందరిని మోసం చేసి...మళ్ళి పెళ్ళి ఇంట్లో వాళ్ళతోనే చేయించుకుని దర్జాగా బతుకుతున్న అపర....నారీమణులున్న ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లకు కూడా పెళ్ళి కుదర్చాలంటే ఆలోచించాల్సిన విష్యమే...!!
పిల్లలైనా...పెద్దలైనా...ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించాలి అంతే కాని తమ సుఖం కోసం అందరిని మోసం చేసి అందలమెక్కడమే ధ్యేయంగా మాత్రమే చూసుకోకూడదు...!! ఇష్టం లేనప్పుడు చెప్పాలి...ఒప్పుకోక పొతే ఒప్పించే ప్రయత్నం చేయాలి...అంతే కానీ తము జీవితాన్ని నష్ట పోవడమో లేదా తమ వారిని కష్ట పెట్టి నష్ట పెట్టడమో చేయకూడదు...!! చాలా తెలివి...తమ సొంతం...అందం ఆభరణం అనుకుంటున్న ఎంతో మంది చేస్తున్న ఇలాంటి పనులు ఇంట్లో వారైనా....నమ్మకాన్ని పొగొడుతున్నారు...!! పెళ్ళి అనేది కూడా ఓ వ్యాపారమో...లేదా డబ్బు...హోదాని పెంచుకునే ఓ వ్యాపకంలా ఐపోతోంది. విజ్ఞత వివేకం మరుగున పడి పోతున్నాయి...ఇరు కుటుంబాలకు మధ్య ఆనందాన్ని పంచి...అనురాగాన్ని...అనుబంధాల్ని పెంచే పెళ్ళి మంత్రాలకు...పెళ్ళి తంతుకు అర్ధాన్ని మార్చాల్సిన రోజులకు తెర తీయాల్సిన రోజు దగ్గర లోనే ఉందేమో...!!
పెద్దలు....పిన్నలు...కాస్త ఆలోచించండి....ఓ సారి...ఈ విష్యాన్ని.....!!
 

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Kopamgaa cheppaaru. samanjasame!

baagundi ..Manju gaaru.

అజ్ఞాత చెప్పారు...

వనజ వనమాలి, మీరు ఒకేసారి నేటి పెళ్లిల గురించి రాసారు. ఒకప్పుడు మగవారు ఆడవారిని మోసం చేస్తే నీచంగా చిత్రికరిస్తూ కన్యాశుల్కం లాంటి నాటకాలు ఎన్నో రాశారు. మరి నేటి కాలం లో ఆడవారు చేసే, మోసాలను చూసి చూడనట్లుగా, వాటిని కాలంతో వచ్చిన మార్పుగా చిత్రికరించి, సుతి మెత్తంగా మందలిస్తూ రాస్తున్నారు. మరి ఆరోజుల్లో మగవారు కూడా కాలనుగుణంగా నడచుకొన్నారని అనుకోవచ్చుకదా! ఈ సో కాల్డ్ అభ్యుదయవాద రచయితలు, మగవారిని విలన్ లు గా చిత్రికరిస్తూ దుమ్మెత్తేట్టు తిట్టిపోశారు. ఇటువంటి ఇటువంటి ఆడావారిని ఎ విధంగా చిత్రికరిస్తూ సాహిత్యం సృష్టించాలి?

తంతుగా మిగిలిపోతున్న " మాంగల్యం తంతునానేనా"
http://vanajavanamali.blogspot.com/2013/02/blog-post_19.html

అజ్ఞాత చెప్పారు...

ఒకే సారి రెండు పోస్టులు ఒకే టాపిక్ మీద .. !!
మనం ఉన్నది సంధి కాలములో. సంధికాలం ఇలానే ఉంటుంది. తప్పు కదా అంటే తప్పే. కానీ, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంత కన్నా ప్రస్తుతం ఏమీ చేయలేం.

చెప్పాలంటే...... చెప్పారు...

అజ్ఞాత గారు తప్పు ఎవరు చేసినా తప్పే... ఆడ మగ అని లేదు...సున్నితమో... కోపమో నాకు తెలియదు...నాకు అనిపించినది రాశాను అంతే..వనజ గారి టపా చూసాకే నేను రాశాను....మీ స్పందనకి ధన్యవాదాలు....

శ్రీకాంత్ గారు మీరు చెప్పింది నిజమే మన జాగ్రత్త లో మనం ఉండాలి మన పని మనం చూసుకుంటే ఉత్తమం
ధన్యవాదాలు మీ స్పందనకి....

కోపం ఏమి లేదు వనజ గారు బాధ అంతే.....థాంక్యు :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner