13, మార్చి 2013, బుధవారం

నేను నీ కోసం నువ్వు నా కోసం...!!

ఎవరిని చూసినా నేనే అంటే ఎలా...!!
అటు ఇటు ఎటువెళ్ళినా నీ కోసమే అంటే ఎలా...!!

కడలి అలల విరుపుల హొయల్లో 
కలల వాకిలి చెంత వేచి ఉన్నా...!!

ఎక్కడో వెదుకులాడుతున్నావు కానీ....
చెంతనే ఉన్నా చూడలేకున్నావు....!!

ఎందుకోయి నీకంత అలుక...!!
పిలువకనే చేరువలో ఉన్నానని చులకనా...!!

నువ్వు నాకోసం నేను నీ కోసం
అని  మన ఇద్దరికి తెలుసు
అయినా వెదుకుతూనే ఉన్నాము....!!
కలిసి...విడి పోతూనే ఉన్నాము....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner