17, మార్చి 2013, ఆదివారం

ఈ జాతిని ఏమంటారు....??

విలువలు, అభిమానాలు ఎంతగా దిగజారి పోతున్నాయి అంటే...!! చూసిన నాకే నమ్మబుద్ది కాకుండా అది నిజమైనా కూడా నేనే తప్పుగా అర్ధం చేసుకున్నానేమో నిజం కాదేమో...!! కాకుండా ఉంటే బావుండు అనిపించేంతగా ఉంది. ఇంట్లో రక్త సంబంధీకుల ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు కూడా నటన అని నమ్మశక్యం కాకుండా ఉంది.
చనిపోయిన మనిషిని పక్కనే పెట్టుకుని రేపు పొద్దున టిఫిన్ ఏంటి? ఇడ్లి నిన్న తిన్నాము...దోశలు ఆరిపోతాయి...పూరి అయితే బావుంటుంది అని రేపటి గురించి ఆలోచించే ఇలాంటి మనుష్య జాతి కూడా ఉంది అంటే నమ్ముతారా...!! చనిపోయారు అని లేకుండా మావాళ్ళని అది చేయనివ్వలేదు...ఇది చేయనివ్వలేదు....చనిపోయిన వారికి వారికన్నా పెద్దవాళ్ళు కొబ్బరికాయలు కొట్టకూడదు...ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా అనుకోవాలో తెలియని అయోమయ స్థితి. చనిపోతున్న మనిషిని పక్కన పెట్టుకుని బొబ్బట్లు, గులాబ్ జాములు, పూర్ణాలు వగైరా వగైరా స్వీట్లు ఆ మనిషికి ఇష్టం అని వీళ్ళు తింటుంటే....!! మరి ఈ కొత్త జాతిని ఏమని పిలవాలో మీకు తెలిస్తే నాకూ కాస్త చెప్పరూ.....!!

కనీసం కాకులు కూడా తోటి కాకికి దెబ్బ తగిలినా  చనిపోయినా ఏమి ముట్టకుండా దాని చుట్టూనే తిరుగుతాయి...!!
 
జబ్బు చేస్తే ఆ మనిషి చనిపోతారని బాధ పడతాము కానీ ఎక్కువరోజులు తీసుకుంటుంటే ఎప్పుడు పొతారా...!! అని ఎదురు చూడము ఎంత మనకు తెలియని వారైనా....!! కాకపొతే ఇక్కడ డాక్టరు ఇంకా రెండు రోజులు ఉండొచ్చు అని చెప్తే....మనం పోనిలే అని మళ్ళి వద్దాములే అనుకుంటాము కాని.....ఇంకా రెండురోజులా అన్న కన్నవారిని ఎక్కడైనా చుశారా...!!
(గమనిక: పైన వివరించిన జాతిలో అందరు చాలా దగ్గరి వారే....వారు అందరు చాలా డీశంట్ )

16 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం,
ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం
వింత నాటకం -ఆచార్య ఆత్రేయ

అజ్ఞాత చెప్పారు...

ఎదుటివాళ్ళు చూస్తారేమోనని బాధ నటించడం లేదు కావున, వాస్తవ దృక్పథంతో ఆలోచించే జాతి అనవచ్చు. చావుపుట్టుకలను సమానంగా చూసే స్థితప్రజ్ఞమైన జాతి అని కూడా చెప్పుకోవచ్చు. జీవితం అశాశ్వతం, అయితే వర్తమానం చచ్చేవరకూ సత్యం, నిత్యం అని ఎరింగిన వాడే వేదాంతి. ఇది గ్రహించక పరులకోసం చింతించువాడు అజ్ఞాని. జ్ఞాని కాని వాడు శుద్ధ సదా కర్మలనాచరించుచునే వుండవలెను.

అజ్ఞాత చెప్పారు...

"వాస్తవ దృక్పథంతో ఆలోచించే జాతి అనవచ్చు"
అయ్యా మహాత్మా ఇక్కడ గురించి రాసిన వాళ్లెవరికి జ్ఞానుల లక్షణాలు లేవు, స్వార్థ పరుల లక్షణాలు తప్ప. ఇటువంటి వాళ్లని చాలా మందిని చూశాం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Pch..:( :(

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అంత జ్ఞానులు కాదండి జ్ఞానానికి అర్ధాన్ని కూడా మార్చేస్తారు వాళ్ళు మీరు పొరపాటు పడినట్టున్నారు మూడో అజ్ఞాత గారు మొదటి అజ్ఞాత గారు నిజాన్ని చెప్పారు ధన్యవాదాలు అందరికి

అజ్ఞాత చెప్పారు...

మా నవజాతి అంటారనుకుంటాను.

అజ్ఞాత చెప్పారు...

మొదటి, మూడవ అజ్ణాతను నేనండి. తన సంపద పంచవలసివచ్చినపుడు, ఒళ్లు వంచి పని చేయవలసివచినపుడు తెలివిగల మనుషులు (రేషనల్ థింకర్స్)అవతారం ఎత్తి ఇతరులతో పంచుకోకుండ దాచుకొంటారు, పనులను ఇంకొకరి నెత్తిన వేస్తారు. వాళ్లు జ్ణానులు కారు, పైకి మెత్తగా కనిపించే స్వార్థపరులు.

అజ్ఞాత చెప్పారు...

మొదటి, మూడవ అజ్ణాతను నేనండి. తెలివిగల మనుషులు, తన సంపద పంచవలసివచ్చినపుడు, ఒళ్లు వంచి పని చేయవలసివచినపుడు రేషనల్ థింకర్స్ అవతారం ఎత్తి సంపదను ఇతరులతో పంచుకోకుండ దాచుకొంటారు, పనులను ఇంకొకరి నెత్తిన వేస్తారు. ఈ స్కిల్ నూ ప్రతి రోజు పదును పెట్టుకొంటారు. వాళ్లు జ్ణానులు కారు, సంఘంలో మంచి స్థాయిలో ఉంట్టు, పైకి మెత్తగా కనిపించే స్వార్థపరులు.

చెప్పాలంటే...... చెప్పారు...

మొదటి, మూడవ అజ్ణాత గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి

చెప్పాలంటే...... చెప్పారు...

అవును కదా బోనగిరి గారు మా నవజాతే.....!!

అజ్ఞాత చెప్పారు...

"మొదటి, మూడవ అజ్ణాత గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి "
మీరన్నది నిజమే. కృత్రిమత్వం, నటనను హర్షించినంతగా వాస్తవాన్ని హర్షించరు. అలా అని ఓ రెండ్రోజులైనా తినకుండా వుంటారా? అదీ లేదు. ముక్కుచీదుతూనే ముప్పూటలా లాగిస్తారు. తిండి గురించి పైకి అడిగిన వారిని తప్పుపడతారు. :)

చెప్పాలంటే...... చెప్పారు...

చనిపోయారని తినడం మానమని అనడం కాదు ఇక్కడ చనిపోయిన గంటలోనే రేపటి టిఫిన్ గురించి అదీను పురినా దోశా అని అడిగే వాళ్ళను ఏమని అనాలి? బతికి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో పోలేము కాని బతకడానికి ఏదో ఒకటి తింటాము మరి గంటలోనే తిండి గురించి ఆలోచించము....మీ అంత విశాల హృదయం లేదండి అర్ధం చేసుకోవడానికి :)

అజ్ఞాత చెప్పారు...

కాకుల మీద మీ అబ్జర్వేషన్ తప్పు అని మనవి చేసుకుంటున్నా.
అయినా నాకు తెలీక అడుగుతాను, బుద్ధిజీవులైన మనుషులు, అల్పబుద్ధి కల కాకులను ఫాలో అవ్వాలా!? కాకులకి మడుసులకీ తేడా వుండొద్దాండీ? పులులు తమ పిల్లలను తామే ఒక్కే సారి తింటాయి. మగ సింహాలు పిల్లలని చంపుతాయని శివంగులు కాపలా కాస్తాయి. తెలుగు సినిమా హీరోలు సింహాలను ఫాలో అవుతారు కాని, మడుసులు ఫాలో అయిపోవడమే?! తప్పండి, తప్పు. జీవుల్లో సర్వోతృష్టమైనది మానవ జన్మ అని తెలిసిందే కదా? మనిషికి తనకంటూ ప్రత్యేకత నిలుపుకోవాలికాని కాకులను, పందులను ఫాలో అయిపోకూడదు అంటాను. :)

చెప్పాలంటే...... చెప్పారు...

నాది అల్ప బుద్దే లెండి అందుకే కాకులు గుర్తుకు వచ్చాయి. సర్వోతృష్టమైన మానవ జన్మ అయినా ఒక్కొక్కరి ఖర్మానుసారాన్ని బట్టి బుద్ధి మారుతూ ఉంటుంది. :)

అజ్ఞాత చెప్పారు...

శవం ముందు టిపినీలు చర్చించారంటే, వారికి ఆ వ్యక్తి మీద మమకారం లేనట్టు, తృణీకారభావం భావంతో చూసినట్టు అనిపిస్తుంది. అది ఆ వ్యక్తిపై ప్రేమ వున్నవారికి సభ్యతగా అనిపించదు. అలాంటి వారికి కావాల్సినది బయట తినమని డబ్బిచ్చి అక్కడినుంచి పంపేయడమే నిర్వాహకులు చేయాల్సిన తక్షణ కర్తవ్యం. మనుషులకు తమ చేష్టలపై విచక్షణ వుంటుంది, జంతువులకు సాధారణంగా వుండదు అంటారు, అంతే. కాకులు గుర్తుకు రావడం జ్ఞానం. మనుషులనో, ఇతరప్రాణులనో గుర్తుకు తెచ్చుకుని పరిస్థితులకు అన్వయించుకునేంత జ్ఞానం జంతువులకు వుంటుందనుకోను. మనిషి మనస్థత్వం చాలా క్లిష్టమైనది.

చెప్పాలంటే...... చెప్పారు...

వాళ్లకు కావాల్సినవి పెట్టించాము లెండి కొన్ని జీవితాలు అంతే అని సరిపెట్టుకోవడమే అంట కన్నా ఏమి చేయలేము...టిఫినీలు అడిగినవారే చాలా దగ్గరి వారు. :) మీ విశ్లేషణకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner