19, మార్చి 2013, మంగళవారం

బావుంది నాకు....!!

వెంటరాని నీడ ఉన్నా 
మాట వినని మనసు అయినా
గాయం చేసిన గతమైనా
చేదుగా ఉండే వాస్తవమైనా
భరించలేని నిజమైనా
ఒప్పుకోలేని అబద్దమైనా
అదే నేను....!!

అనుక్షణం వెన్నంటి ఉండే తోడూ
అహర్నిశమూ నాతోనే లోకమంటూ
ఎప్పుడూ నా చుట్టూనే పరిభ్రమించే
నీ తలపుల సుగంధాలు
మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తూ
గతాన్ని మరచి
మదిలో గూడు కట్టుకున్న
భయాల్ని వదలి
నా నిజమైన తీయనైన వాస్తవం
నువ్వని తెలిపిన క్షణం.....!!

మరచిపోలేని  ఆ క్షణం
నన్ను నేను మరచిన క్షణం...!!
నీ కోసం తపించిన క్షణం...!!
అందమైన అబద్దమైనా
బావుంది నాకు....!!
అలా నీతో నేనుండటం....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Naresh చెప్పారు...

it is nice...........

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi Naresh garu

విద్యాసాగర్ గుంటూరి చెప్పారు...

ఒకే ఒక్క వాక్యం నాకు అర్ధం కాలేదు "వెంటరాని నీడ ఉన్నా "

మిగతాది అంతా చాలా బాగా చెప్పారండి. శుభాకాంక్షలు

చెప్పాలంటే...... చెప్పారు...

చీకటిలో నీడ కనిపించదు కదా అదే వెంతరాని నీడగా తీసుకున్నాను
ధన్యవాదాలు విద్యాసాగర్ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner