20, మార్చి 2013, బుధవారం

అంతు చిక్కని కాలం....!!

కాలం అలా అలా జారి
జరిగి పోతూనే ఉంది
బరువుని భారాన్ని
కష్టాన్ని కన్నీటిని
సుఖాన్ని సంతోషాన్ని
ఆనందమైనా విషాదమైనా 
కన్నీరే అన్నట్టు....!!
ఎవరితో సంబంధం లేకుండా
అన్ని మోసుకుంటూ
ఏ అనుభూతికి స్పందించకుండా
అన్ని తనలోనే దాచుకుని
తీరం లోపలి సంద్రంలా ప్రశాంతంగా....!!
మానని గాయాన్ని కూడా
మరుపుగా చేసే మంత్రాన్ని 
తనలోనే దాచుకుంది
మనం అడుగుతామేమో అని
అందనంత దూరంలో
అంతు చిక్కని కాలం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner