22, మార్చి 2013, శుక్రవారం

ఇంకా అక్కడే చూస్తున్నా....!!

మోహమెందుకో మనసంటే....!!
ఇష్టమెందుకో మనసులోని నువ్వంటే...!!
చెప్పలేని మాటల గాఢత
తెలుసుకోగలిగే మరో మనసు ఎక్కడో....!!
పయనమై వెళిపోయినా....
తిరిగి రావని తెలిసినా....
ఇంకా అక్కడే చూస్తున్నా ఎందుకో మరి...!!
నన్ను వదలి వెళ్ళిన గుర్తు
నీ ఎరుక లోనికి వచ్చి
మళ్ళి వెనుదిరిగి నా కోసం
నువ్వు వస్తావేమోనని...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner