29, మార్చి 2013, శుక్రవారం

జీవిత కొలను....!!

అంతరంగపు కొలనులో
అలజడి రేపే ఆలోచనా తరంగాలు
అలల సుడిగుండాలు ఎన్నో....!!

కలువల అందాలు కొన్ని...
ఆరాధనతో స్పృశిద్దామంటే...
చుట్టుకునే అడ్డుతీగలు ఎన్నో....!!

సూర్య చంద్రుల కిరణాల తాకిడితో...
అచ్చెరువందే ఆనందంతో
పులకరించే కలువ తామరలు
జీవిత గమనాన్ని చూపే దిక్చుచీలు....!!

మది అంతరంగం ఆలోచనాతరంగం
కొలనుకు ప్రతి రూపం...!!
ఆనందం ఆహ్లాదం కలువ తామరలు...!!
కష్టం నష్టం కాళ్ళకు చుట్టుకునే తీగలు...!!
పచ్చని ఆకులు బంధు జన సమూహం...!!
అన్నిటిని తనలోనే దాచుకుని
అందాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని
కనులకింపుగా పంచే కొలను జీవిత సత్యం....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Very nice Manju Gaaru.

All the best.

జలతారు వెన్నెల చెప్పారు...

కవిత బాగుంది మంజు గారు. Best of luck!

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Vanaja garu VEnnela garu kavita baagundi ante bhahumati raademo :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner