4, మార్చి 2013, సోమవారం

నా ఎరుకలోకి రాని నీ ప్రేమ....!!


అవునూ ఓ నిజం చెప్పు....!!
నిజంగా అది ప్రేమేనా...!!
ఇష్టానికి మరో పేరు ప్రేమేనా...!!

ప్రేమైనా...ఏమైనా...ఇష్టమైనా...మరేదైనా...అంతర్గతంగా నీ మనసులోని చెప్పనలవికాని ఊహల మాటలకు నీలోని మరో మనిషి సాక్ష్యం కదూ....!! ఎందుకోయ్...!! ఆ మనిషిని పదే పదే తట్టి లేపుతున్నావు.? ఒంటరిగా నువ్వున్నప్పుడు నా ఆలోచనలు నిన్ను చుట్టుముడుతుంటే అది ప్రేమేమో అని భ్రమలో ఉన్నావేమో...!! అలా కోపంగా చూడకు ఓ క్షణం ఆలోచించు...!! అయినా ప్రేమే జీవితం కాదు కదా...జీవితంలో ఓ మధుర క్షణం లేదా మధుర జ్ఞాపకం కావచ్చు...దాని కోసం అన్ని కోల్పోనక్కరలేదు...మనిషిని జీవశ్చవాన్ని చేసే ప్రేమ ప్రేమ కాదు...నవనాడులలో జీవాన్ని నింపి జీవితానికి ఓ అర్ధాన్ని...గమనాన్ని నిర్దేశించేదే నిజమైన ప్రేమ....!!
ప్రేమ ఎప్పుడు ప్రేమగానే ఉంటుంది...మనకి దొరకలేదని ద్వేషంగా మార్చుకోవడమే తప్పు.
ప్రేమను ప్రేమించే ప్రేమ ఎప్పటికి ప్రేమగానే ఉంటుంది. నీకిష్టమైన  ప్రేమ నీలోనే ఉంది.. నీతోనే ఉంది...మరి నిన్ను వదలి పోయిందని ఎందుకనుకుంటున్నావు..? ఎప్పటికి నీతోనే ఉండే నీ ప్రేమను నీతో లేదని దిగులు పడకు...నిరాశ చెందకు...!! నీలోనే నేనున్నా ఇన్నాళ్ళు నాకే తెలియని నీ ప్రేమ నిన్ను కాదని ఎలా వెళిపోతుంది...? నీ ప్రేమ  ఎంతో ఇష్టంగా నీ దగ్గరే ఉంటుంది ఎప్పటికి....!! అయినా నీ ప్రేమ గురించి నీకు తెలుసు కదా...!!
అవునూ ఇదంతా నీకెందుకు చెప్తున్నాను...నువ్వేంటో నాకు తెలుసు కదా...!! నా ప్రేమ నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి అంటావు కదా...!! నేనెవరో నీకు తెలియదా...!! నీలోని ఆ మరో మనిషినేగా నేను...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజవనమాలి చెప్పారు...

నేనెవరో నీకు తెలియదా...!! నీలోని ఆ మరో మనిషినేగా నేను...!!

:) Good one.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank U Vanaja garu :)

అజ్ఞాత చెప్పారు...

మార్చి నెల మిట్ట మజ్జానం ఇక్కడ వైజాగ్లో మన్డిపొతుంది. ప్రవీన్ మందాగిని అనే వ్యక్తి కంబల్ కొండ వద్ద కెమెరాలు గన్నులు, పిస్తోళ్ళు అమ్ముతున్నాదు. అప్పుడె అక్కడికి మెల్లకళ్ళ బదర్వాజ, ఒంగోలు గొట్టం, ఇంద్రకళ్ళ కార్తికేయ రెడ్డి వచ్చిండ్రు. సమావేశం బాగా జోరుగా సాగుతుంది. తెలంగాన రానీయకుండా ఆపుదామని ముగ్గురు ప్లాంల మీద ప్లాంలు గీసారు. అది విని ప్రవీన్ గుందె తరుక్కుపొయింది. వెంతనె కెసియార్ కి ఫొన్ చెసదు. కెసియ అమ్మనా బూతులూ తిత్తాదు. అవి విని తత్తుకొలెక మందాగిని ఆత్మహత్య చెసుకున్నాదు. కానీ ఈ ముగ్గురి మీద పగ అతన్ని బతికించింది, పక్కనె ఉన్న మురిక్కాల్వ నీల్లలొ కప్ప గుద్దు నుంచి బయతకు వచ్చదు ప్రవీన్ కొత్త అవతారం
మండూక మందాగిని.
ప్రవీన్ ఇప్పుదు పాట అందుకున్నాడు
"కప్ప కప్ప కప్ప
కప్ప కప్ప కప్ప
ఇజీ ఇజీ ఇజీగా మీ ముగ్గుర్ని చంపి పొగా
కప్ప కప్ప కప్ప
......
వన్ నిన్ను చంపడం టూ నిన్ను చంపడం.....
................
కప్ప కప్ప కప్ప"

ఇది చూసి బయపది కార్తీకెయ రెద్ది హైదరాబాదుకి ఒంగోలు గిత్త మద్రాసుకీ మెల్లకళ్ళ బురద్వాజు అమెరికాకి పారిపొయరు.
కప్ప కనిపించిన వెంతనె మెల్లకళ్ళ బద్ర్వాజ వెరె రాస్త్రానికి వలస వెలతాదు.(ఇంకా ఉంది)

చెప్పాలంటే...... చెప్పారు...

అంటే నా కధ బాలేదనా అండి అజ్ఞాత గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner