7, మార్చి 2013, గురువారం

నీ రాకను తెలుపుతూ....!!

దిక్కుల దారంట మబ్బుల మాటున
చుక్కల రెక్కల వెలుగుల జిలుగులలో
ఎక్కడని వెదికేది నీ జాడ కోసం.....!!

కానరాని కోయిలమ్మ కుహూ కుహూ రాగాలలో
నీ గాత్రం కలిసి వినిపిస్తుందేమో అని వింటూనే ఉన్నా...!!
ఎక్కడా వినిపించదే నీ స్వరం....!!

పరుగులెత్తే అడుగుల సవ్వడిలో
నీ అందెల మువ్వల సడి కలిసిందేమో అని
నీ పారాణి పాదాల కోసం వెదుకుతూనే ఉన్నా...!!

గల గలలాడే గాజుల చప్పుడు వినిపించి
పంచెవన్నెల రంగుల గాజుల
కుసుమ కోమల కరము నీదేనేమో అని చుస్తే...!!

ఎక్కడినుంచో ఓ పైరగాలి ఇలా వచ్చి
అలా నను తాకి వెళ్ళింది నీ రాకను తెలుపుతూ....!!

(అన్నట్టు ఇది నా 400 వ టపా -:) నా రాతల్ని అభిమానిస్తున్న అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు )

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

4oo va tapa!!!!naalugu vandala vandanalu!!!!abhinandanalu!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

జలతారువెన్నెల చెప్పారు...

400 టపాలా మంజు గారు?
ఆందుకోండీ శుభాకాంక్షలు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు సూర్య ప్రకాష్ గారు

ధన్యవాదాలు వెన్నెల గారు

Real world చెప్పారు...

manju gaaru mi tapa lu anni chadhuvuthu shiva rathri roju ippati varaku jaagaram chesanandi.. chala ante chala bagunnay...
thank u very much..

చెప్పాలంటే...... చెప్పారు...

ఓపికగా నా టపాలు అన్ని చదివినందుకు + మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మొత్తానికి ఈ శివరాత్రి నా టపాలతో గడిచిపోయింది అంటారు -:)

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner