13, ఏప్రిల్ 2013, శనివారం

ఈ అనుబంధం.....!!

కలత నిదురలో కనిపించావు
కన్ను తెరిస్తే కనుమరుగైనావు

కలల కౌముది కట్టి పడేసింది
ఊహల వంతెన వారధిగా నిలిచింది

చాటు మాటు సోయగాలు
మబ్బుల మాటున మసక జాబిల్లి అందాలు

పదే పదే పలకరించే నీ పలకరింపుల
జ్ఞాపకాల జాజుల సుమ గంధాలు

వద్దని విదిలించినా వదలిపోనివి
కాదని వదిలేసినా వీడి పోనివి

అందుకేనేమో అప్పుడు అల్లుకున్న
ఈ అనుబంధం ఇప్పటికి అలాగే
అప్పటి అనుభూతులతో అజరామరం...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

బాగుంది .

వనజవనమాలి చెప్పారు...

Baavundi Manju gaaru.

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారు, వనజ గారు

జలతారు వెన్నెల చెప్పారు...

Nice one manju gaaru

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner