28, జులై 2013, ఆదివారం

ఈ తెలివి చూసారా.....!!

మొదటి విడత పంచాయితీల్లో వెనుకబడిపోయామని కొత్తగా మళ్ళి మరో ప్రహసనం మొదలుపెట్టి రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం అమ్మగారు చేసిన ప్రయత్నం కాస్త సఫలం అయ్యింది...మొత్తానికి  తెలంగాణా ఇస్తున్నాము రండి అంటూ మరోసారి జనాలను మోసం చేస్తున్న రాజకీయ చరురతను అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు....??  చేతులెత్తండి మరి... -:).
మింగ మంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం....!! మరి ఏం చేయాలి చెప్మా...ఇలా ప్రాంతాలలో చిచ్చులు పెట్టి ఆడుకోవాలన్న మాట. చూసారా ఎంత తెలివో... అత్తగారు ఉంటే కోడలమ్మ తెలివి చూసి ఎంత సంబర పడిపోయేదో....పాపం...!! ఇక్కడ పాము కప్పల్లో దేనికి బలం ఎక్కువో చూసి దాని వైపు వెళ్ళాలి ఇది అంతే...లాభం ఎటో, ఎంతో చూసుకోవడమే...!!
తెలంగాణా ఇస్తామంటే సిమాంద్ర నేతలు ఊరుకోరు...ఇవ్వమంటే తెలంగాణా నేతలు ముఖ్యంగా అప్పుడప్పుడునే...వేరే ఏ వ్యాపకం లేనప్పుడు జనాలు తనని మర్చి పోతున్నారేమో అని అనుకుంటూ మా తెలంగాణా ప్రజలు వెనుకబడిపోతున్నారు అని గుర్తు చేసుకునే కె సి ఆర్ గారు అస్సలు ఊరుకొరు....మళ్ళి ఎన్నికల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది....మనమూ చూడటం తప్ప ఏమి చేయలేము కదా...ఇష్టమైతే ఓటు వేస్తాం అంత కన్నా చేయగలిగినది మాత్రం ఏముంది...!! ఇది ఇలా సాగుతూనే ఉంటుంది మనం నాయకులను నమ్మినన్ని రోజులు...కొత్తగా మార్పేం ఉండదు....!! ఎటొచ్చి నాయకులు ఖాళి చేసిన ఖజానాలు నింపడానికి మనకు సంబంధం లేని కరంట్ బిల్లులు కడుతున్నట్లుగానే, రోజు పెరిగే ఇంధన ధరలను... ఇలా దేనిని ఆపలేం...!! 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

1 రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం అమ్మగారు చేసిన ప్రయత్నం కాస్త సఫలం అయ్యింది..
..2 తెలంగాణా ఇస్తామంటే సిమాంద్ర నేతలు ఊరుకోరు.
.................................
పై రెండు వాఖ్యలు కుడా మీరు రాసినవే .. రెండో విడతలో తెలంగాణా, సీమంధ్ర రెండు చోట్ల కాంగ్రెస్ కె ఆధిక్యత వచ్చింది .. తెలంగాణా ఇస్తామంటే సీమంధ్రలో వ్యతిరేకత రావాలి కదా .. లేక సీమంధ్ర నాయకులు తెలంగాణా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంటే సీమంధ్ర ప్రజలు తెలంగాణా ఇవ్వాలని చెబుతున్నారా ?
పంచాయితి ఎన్నికలకు , తెలంగాణా పై ప్రకటనకు సంబంధం ఉండదు . .. అలా ప్రకటన చేసి 40% ఉన్న తెలంగాణాలో గెలవాలను కుంటే 60@ ఉన్న సీమంధ్రలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి కదా .. ఆయా గ్రామాల్లో అభ్యర్థి పలుకుబడి, కులం, బందు గానం వంటివే పంచాయతి ఎన్నికల్లో ప్రాధాన్యత వహిస్తాయి . - murali

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు అనుకునేది ఓ రకంగా నిజమే కావచ్చు..కాని సిమాంద్రలో డబ్బులు ఎన్నికలను శాసిస్తున్నాయి..ఎక్కడైనా డబ్బు మందే....!! ఇవి రెండు నాయకుల దగ్గరే ఎక్కువ.. కాకపొతే విసిగిన కొంతమంది కారణంగా ఫలితాలు మారుతున్నాయి..కాదంటారా మురళి గారు...!! ఒక్కోసారి ఒక్కో కొత్త ప్రయోగాలతో ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner