11, నవంబర్ 2013, సోమవారం

ఆలోచించుకోండి....!!

మనం మంచివాళ్ళమై పోవడానికి మనతో ఉన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చిత్రీకరించనక్కర లేదు. మనం మనలా ఉంటే చాలు...మంచి అనిపించుకోవడానికి ఈ రోజు నటిస్తే సరిపోతుందా...!! రేపు, ఎల్లుండి...ఇలా ఎన్ని రోజులు నటన జీవితంగా బతికేద్దాం...!! కనీసం మనతో మనమయినా మనసు విప్పి మాటాడుకునేదెప్పుడు ...?? మనకు సంతోషాన్నిచ్చే అబద్దాన్ని స్వీకరించే సహృదయం...బాధను కలిగించే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అలానే ఉండాలి. మనకు నచ్చిన మాటలు బావున్నాయని, మన తప్పులు ఎత్తి చూపే విమర్శలు బాలేదని అనుకోవడం మనని మనం మోసం చేసుకోవడమే...!! అందరు మనకు నచ్చినట్లే ఉండరు.. అలా అని మనం కూడా అందరికి నచ్చేటట్లు ఉండలేము...మనం మనలానే ఉంటూ ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటే చాలు...మనసు లేని మనుష్యుల్లా కాకుండా పెద్ద మనసు లేకపోతె పోయే కనీసం ఉన్న చిన్న మనసునయినా దాయకుండా దానికి  నచ్చినట్లు మనలా ఉందాం...!!
ఇప్పుడు చూడండి అందరి మాటలను నమ్మిన ఆంధ్రులు విడి పోకుండా ఉంచగలరా ఆంధ్ర రాష్ట్రాన్ని..!! ఎవరిని  మోసం చేయడానికి ఈ బందులు, ఉద్యమాలు చేసారు...?? ఇప్పుడు విరమించుకుని చేతులెత్తేసి ప్యాకేజీల కోసం మొరలు ఎత్తి అర్రులు చాస్తున్నారు... బందుల కారణంగానే ఆర్ టి సి చార్జీలు పెంచామని వాళ్ళు చెప్తున్నారు...పంటలకు నష్టాలు వచ్చాయని కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి..ఇక కనపడని కరంటుకు కట్టే బిల్లుల బరువు చెప్పనక్కరలేదు..చేతులెత్తేసిన  ఉద్యమ నాయకులు వీటిలో కనీసం ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా...!! ఎందుకు చేశారు ఉద్యమాలు...?? ఏం సాధించారు..?? జనాన్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు..!!
పోరాట పఠిమ లేని ఏ ఉద్యమాలు ఏం ఒరగబెట్టవు అన్నది జనంలోని మనకు ఇప్పటికయినా అర్ధం అయితే చాలు...మార్పు అనేది మనలో రావాలి...మనతోనే మొదలు కావాలి...అవినీతి పేరుకు పోయింది, డబ్బు చుట్టూనే అందరు అని అనుకోకుండా మనం మారితే అదే ఓ గొప్ప మార్పుకి పునాది అవుతుంది..నాయకులు చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలు విని అవే నిజాలు అనుకోకండి...నిజాలు తెలిసినా మనకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా కాస్త చైతన్యం చూపండి...రేపు ఓట్ల కోసం మీ గడపకు వఛ్చిన నాయకులకు ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోండి....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"ఎందుకు చేశారు ఉద్యమాలు...?? ఏం సాధించారు..?? జనాన్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు..!!"
తెలిసి చేసిన ఉద్యమాలివి. సామాన్యుల్ని మభ్యపెట్టి ఒకర్ని మించి ఒకరు శ్రేయోబిలాషుల్లా మాస్కులు తొడుక్కుని ఆడిన రాజకీయ నాటకం. ఎందరి భావోద్వేగాలనో వాడుకుంటూ.
బాధాకరమైన నిజం .... సుప్రభాతం మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు నిజాలు అన్నందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner