19, ఫిబ్రవరి 2014, బుధవారం

మనకు ఇష్టం ఉన్నా లేక పోయినా...!!

తెంచుకోలేని ప్రేమను బంధాలను పెంచుకుంటున్న కొద్ది సంతోషం బదులుగా బాధ కోపం పెరుగుతుంటాయి
ఎక్కువగా... అనుబంధాలను అటు వదిలేయనూ లేము అలా అని ఇటు ఉండనూ లేము... ఇది మనసు చిత్రమో మనిషి మాయాజాలమో ఏది తెలియని పరిస్థితి...!! మనుష్యులు దూరంగా ఉన్నా మనసులు వారి ఇష్టమైన వారి చుట్టూనే పరిభ్రమిస్తూ ఆలోచనలను వారికి సమీపంలోనే ఉంచుతాయి...మనకు తెలియకుండానే...!!  దూరంగా ఉన్నా అమ్మకు బాలేదని కొడుకు....కొడుకు ఎలా ఉన్నాడో అని ఆ తల్లి వేదన పడుతూనే ఉంటారు.... దగ్గరగా లేని ప్రతి ప్రేమకు ఇష్టానికి ఈ బాధ ఉంటుంది....!! ఈ విడి పోవడాలు కలుసుకోవడాలు ఏమిటో ఈ అనుబంధాల ప్రయాణం...!! పొగ బండిలా ఈ జీవిత ప్రయాణం.... ప్రతి కలయికా విడి పోవడానికే... అలానే ప్రతి వీడుకోలు మరో కొత్త కలయికకు నాంది అని ఎవరో చెప్పేసారుగా ముందే...!! కాల గమనంలో కాలంతో పాటుగా గతాన్ని దాటుకుంటూ.. వాస్తవంలో బతుకుతూ... వర్తమానం మీద కొండంత ఆశతో... రాబోయే సంతోషాన్ని అందుకోవాలన్న ఆరాటాన్ని ఆలంబనగా చేసుకుని మనవైన మనసైన జ్ఞాపకాలను ఇష్టంగా మోసుకుంటూ కాలం వేగాన్ని అందుకోవడమే మన పని.... లేదా మన జీవితచదరంగంలో వెనుకే ఉండి పోతూ ఓటమినే చిరునామాగా చేసుకోవాల్సి వస్తుంది మనకు ఇష్టం ఉన్నా లేక పోయినా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మనుష్యులు దూరంగా ఉన్నా మనసులు ఇష్టమైన వారి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి.... తెలియకుండానే...!! అమ్మకు బాలేదని కొడుకు....కొడుకు ఎలా ఉన్నాడో అని తల్లి వేదన .... దగ్గరగా లేని ప్రతి ప్రేమకు, ఇష్టానికి ఈ బాధ ఉంటుంది....!! చిత్రం ఈ అనుబంధాల ప్రయాణం...!! పొగ బండిలా ఈ జీవిత ప్రయాణం.... ప్రతి కలయికా విడి పోవడానికే... అలానే ప్రతి వీడుకోలు మరో కొత్త కలయికకు నాందే...!

వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చెపుతున్నట్లుంది .... చక్కని భావన
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...


ధన్యవాదాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner