13, మార్చి 2014, గురువారం

నేను ఓ పార్టీ పెట్టేస్తే పోలా....!!

మారుతున్న రాజకీయ సమీకరణాలు పార్టీలు మారుతున్న నాయకులు, కొత్త పార్టీలు పుడుతున్న తరుణాలు.... 
చూసారా ఎన్ని జరిగి పోతున్నాయో తెలంగాణా సీమాంధ్ర అనగానే...!! తెలుగువారు అని మర్చిపోయి ప్రతి ఒక్క పార్టీ తెలంగాణా రావడానికి మేమే కారణం... సీమాంధ్రకు వరాల జల్లులు కురిపించే ప్రయత్నాలు చేసింది మేమే అని చెప్పుకుంటున్నారు... కనీసం రేపు రాజధాని ఏదో కూడా చెప్పలేని ఈ నాయకులను నమ్మి మళ్ళి గెలిపించాలో ఓడించాలో మన చేతుల్లోనే ఉంది... ప్రతి ఒక్కరు పార్టీ పెట్టినప్పుడు జనం కోసమే కాని పదవుల కోసం కాదు అని చెప్పినవారే ఇప్పటి వరకు...అది ఎంత వరకు నిజమో మన అందరికి తెలుసు...పార్టి పెట్టి కనీసం చెప్పిన పదాలకు అర్ధాలు కూడా తెలియకుండా కటౌట్లు పెట్టుకున్న ఆ మహనీయులు జనం కోసం ఏం చేసారో కూడా తెలియని మహా నటులు పదవి కోసం ఎంత బాగా మన ముందు నటించి ఇలా అనడం కుడా తప్పేనేమో జీవించి మొత్తానికి ఏదో ఒక మంత్రి పదవి సంపాదించి దానికోసం తనను నమ్మిన జనాన్ని నట్టేట ముంచి...ఏ పార్టీకి ఇప్పటి వరకు రానన్ని డబ్బులు చక్కగా దండుకుని ఈ విభజన విషయంలో కూడా జీవించి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న మహా మనీషి... నీతులు చెప్పడానికే ఉంది పాటించడానికి కాదని సహ నటుని మరణానికి కారణం అయిన పెద్ద మనిషి ఒకరు..తండ్రి పేరు చెప్పుకుని పదవుల కోసం మరో నాటకాన్ని ఆడుతున్న మరో నాయకురాలు ఒకరు...విభజనకు ఒప్పుకోనప్పుడు బి జె పి లోనికి వెళ్ళడం లో ఆంతర్యం ఈపాటికి అందరికి అవగతమై ఉంటుంది... మాటలు చేతలు ఇప్పటి వరకు బాగానే చెప్పిన చేసిన కిరణంను కూడా నమ్మకపోవడానికి సదరు నటనాగ్రేసరులే కారణం అవుతున్నారు...మరో సింగపూర్ మలేషియాలా చేయనవసరం లేదు ముందు రాజధాని కోసం కుమ్ములాటలు లేకుండా కనీసం ఇప్పుడయినా తెలుగు జాతి అని ఆలోచిస్తే బావుంటుందేమో...!! కొత్త పార్టీలు పెట్టడం కాకుండా జనం కోసం ఆలోచించే నాయకులు ఎక్కడో మరి..!! చివరగా ఓ మాట ఇంత మంది పార్టీలు పెట్టగా లేనిది నేను ఓ పార్టీ పెట్టేస్తే పోలా....-:)

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఆగండాగండి. పాత సబ్బు(నటుడు) కన్నా మేలైన కొత్త సబ్బొకటొచ్చింది. అదే కంపెనీవారు చేస్తున్నారండోయ్! ఇది మరింతగా మెరుగ్గా మకిలిని వదలగొడుతుంది. మీపంచెలుకూడా రాజకీయాల్లాగా దయ్యాలకన్నా థెల్లని థెలుపుతో మెరిసిపోవాలనుకుంటే ఈ సబ్బు వాడాల్సిందే. అసలే ఇది పంచెలు, పంచిల స్పెషలిష్టు. సొంత సబ్బులుచేసుకొనేముందు మార్కెట్లో ఉన్న సబ్బులను వాడిచూడడొకసారి మాస్టారూ!

మీకసలు విషయం అర్ధం కావడంలేదు. మన అభ్యున్నతికోసం, మన సుఖమయ జీవితాలకోసం వాళ్ళు ఏగడ్డికరవడానికైనా సిధ్ధంగా ఉన్నారు. అర్ధంచేసుకోరూ!

అజ్ఞాత చెప్పారు...

ఆలస్యంగా రిలీజ్ చేస్తే హిట్టవ్వడానికి ఇదేమైనా "అత్తారింటికి దారేది" సినిమానా?

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే అండి ఈ కొత్త సబ్బు సంగతి రాయడానికి కాస్త మరపు వచ్చింది .....బోనగిరి గారు మీరు అన్నది అక్షరాల నిజం అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner