17, మార్చి 2014, సోమవారం

స్వాగత సుమాంజలి....!!

వాసంత సమీరాలు వలపుల వాయులీనాలై
రంగుల రసకేళి ఆనందాల ఆటల తన్మయంలో 
పులకరిస్తున్న గోపికలతో గోపికాలోలుడు
పచ్చని చివురుల తొడుగుల పుడమి అందాలు
లేచివురుల రుచులు చవి చూసిన కోయిలమ్మ
క్రొంగొత్త రాగాల స్వర సమ్మేళనాల సమ్మోహనాలు
చీకటి వెలుగుల జతను పరిచయం చేసే జీవితపు
అన్ని వర్ణాల కేరింతల సంబరాల సంతోషపు హేల
భాషలు వేరైనా భావాల కలయిక ఒక్కటైన
ముచ్చటైన మురిపాల సందడి ఈ సంతోషపు
సంబరాల వసంతపు వనరాణి స్వాగత సుమాంజలి

ఈ నా భావాలకు నాకు ప్రధమ బహుమతిని అందించిన గౌరవ న్యాయ నిర్ణేతలకు ... మన తెలుగు మన సంస్కృతి గౌరవ నిర్వాహకులకు నా మనఃపూర్వక కృతజ్ఞతా వందనాలు.... మిత్రులందరికీ వసంతాల హోలీ సంబరాల శుభాకాంక్షలు


2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

లే చివురుల రుచులు చవి చూసిన
కోయిలమ్మ
క్రొంగొత్త రాగాల
స్వర సమ్మేళనాల సమ్మోహనాలు

సంతోష సంబరాల వసంత స్వాగతాలు
ఎంత చక్కని భావనో .... చాలా బాగుంది శుభోదయం మంజు గారు!!

చెప్పాలంటే...... చెప్పారు...

నా మనసు భావాలకు మీ విలువైన భావనల రూపాలకు నా వందనాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner