21, మార్చి 2014, శుక్రవారం

ఈ రాజకీయాలు మనకి అవసర మంటారా..!!

కనీసం మనలో ఒక్కరైనా ఎన్నికలను నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా....!! ఇంతా చేసి
మనం డబ్బులు తీసుకునో లేదా మనకు పార్టీల మీద ఉన్న అభిమానంతోనో నాయకులను ఎన్నుకుంటున్నాం....వారు ఊసరవెల్లుల్లా పదవుల కోసమో అధికారం కోసమో పార్టీలు మార్చుతూ మనను మాటలతో మోసం చేస్తూ డబ్బులు అందినంతా దోచుకుంటూ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఓటు వేసిన ఒక్కరినైనా గుర్తు ఉంచుకున్న సంఘటన చరిత్రలో ఉందా...!! మన డబ్బులతో ఎన్నికలు నిర్వహించి గెలుపుని కానుకగా వారికి ఇస్తే వారు అధికారంలో చెలామణి అవుతూ బంగారు సింహాసనాల్లో తులతూగుతూ కనీసం ప్రయాణ సౌకర్యాలు...నడవడానికి సరిగా రోడ్లు కూడా లేని పల్లెలు ఎన్నో..!! ఎన్నికలకు అయ్యే ఖర్చు....గెలుపు ఓటములకు వారు  చెల్లించే మూల్యం అసలు ఎన్నికలు లేకుండా చేసి మన భారతదేశ అభివృద్దికి ఉపయోగిస్తే..!!
కిరణ్ గారు మాటలు లెక్కలు బానే  చెప్తున్నారు..కాని మరో చిరంజీవి కారని నమ్మేదెలా...!! దోచుకున్న ధనం ఏం చేయాలో తెలియక అధికార పీఠాన్ని అధిరోహించాలని ఒకరు...సీట్ల కోసం అందరూ మిత్రులే ఇప్పుడు...భారతీయ జనతా పార్టీ.. తెలుగు దేశం...కొత్తగా వచ్చిన జన సేన...సీట్ల లెక్కల్లో మునిగి తేలుతున్నారు...అక్కడ తెలంగాణాలో కూడా ఇదే తంతు...ఈ కలసికట్టు దేశాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి మాత్రం పనికి రాదు...!! ఓటరు అనేవారు కనీసం ప్రతి ఒక్క పార్టీ నేతలు కానివ్వండి..నాయకులు కానివ్వండి చెప్పే మాతలు వింటు కూడా వారు ఒకరి మోసాలు ఒకరు బయట పెడుతున్నా మనం ఎందుకు ఓటు వేయాలి అని ఒక్కసారి ఆలోచించండి...!! ఇలాంటి పార్టీలు...అధికారం కోసం క్షణానికో పార్టీ మార్చే నాయకులు..స్వప్రయొజనాల కోసం అధికారం ఉంది కదా అని నియమ నిబంధనలు లెక్క చేయకుండా నియంత పాలన అమలు చేసే మేడం గారు...దగాకోరులకు పట్టం కట్టి మన జీవితాలకు మనమే చరం గీతాలు పాడుకోవడం అవసరమా...!! ఈ రాజకీయాలు మనకి అవసర మంటారా..!! మీరే ఆలోచించండి....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

అలా అని నొటాకి ఓటు వేసి వృథా చేసే కంటే ఉన్న అభ్యర్థులలొ మంచి వ్యక్తిని ఎన్నుకుంటే తరువాత ఎన్నికల్లొ ఇంకా మంచి అభర్థి వచ్చె అవకాశం ఉంటుంది కదాండి

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే అండి మనఃపుర్వక ధన్యవాదాలు

vemulachandra చెప్పారు...

ఆర్ టి ఐ ఒక వైపు మీడియా ఒక వైపు కలుగుల్లో దాక్కోలేని స్థితి లో కాసేపు శతృవులుగా కాసేపు సన్నిహితులుగా .... అవునూ ఎవరినైనా నమ్మేదెలా? అందరూ దొంగలే తేడా అల్లా .... ఒకరు బందిపోటు ఒకరు చిల్లరదొంగ .... రాజకీయాల్లో గాంధీ మహాత్ముడు సుందరయ్యల లాంటి నాయకుల్ని చూడలేమేమో అనిపిస్తుంది.
బాగుంది పోస్టింగ్
అభినందనలు కవయిత్రి గారు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner