18, మార్చి 2014, మంగళవారం

గీతాబోధకుడు....!!


గోపాలుని వదనం సుందర సుమధురం
గోపికాలోలుని మురళీగానం ముల్లోకాలకు
పరవశాల ప్రియ నర్తనాల వసంత విలాసం
మన్ను తిన్న చిన్ని కన్నయ్య చూపిన మహార్లోకాలు
 యశోదమ్మ చూడగా అమాయకంగా ఆటలాడిన
వెన్నదొంగ వెన్నెలాటలు వేసిన వేషాల రూపాలు
చిన్ననాటి మిత్రునికి అందించిన ఆపన్న హస్తం
చీరలు దాచిన చిలిపి పాండవ సతి మానం నిలిపి
అష్ట సతుల ఆనందాలలో ఇష్ట సఖుల సరసన
ప్రేమకు ప్రతి రూపాన్ని బోధించిన పెన్నిధి
ధర్మార్దాల కామ మోక్షాల తత్వాన్ని అందించి
కర్త కర్మలకు అతీతుడను కాదని శాపాన్ని
సంతోషంగా స్వీకరించిన గీతాబోధకుడు....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

ప్రేమ రూపాన్ని బోధించిన పెన్నిధి
ధర్మార్ద కామ మోక్ష తత్వం
శాపాన్ని
సంతోషంగా స్వీకరించిన ....గోవిందుడు!
ఎంతో చిక్కని భావన .... అభినందనలు మంజు గారు!!

చెప్పాలంటే...... చెప్పారు...

నా మనసు భావాలకు మీ విలువైన భావనల రూపాలకు నా వందనాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner