12, మే 2014, సోమవారం

ఓ శిధిల శిలగానే మిగిలి పోవాలో....!!

తరాలు మారుతున్నాయి అంతరాలు పెరుగుతున్నాయి .... అనుబంధాలు అభిమానాలు దూరమౌతున్నాయి...
అయినా మనకు ఇలానే బావుందని ఆనందపడుతూ అసలు సంతోషాన్ని కోల్పోతున్నాము... జీవితం చాలా చిన్నది కాని దానిలో ఎన్నో ఇమిడి ఉన్నాయి మనం ఒకసారి మనని  తరచి చూసుకుంటే ఎన్ని కోల్పోతున్నామో తెలుస్తుంది... జీవితం అన్న తరువాత  ఒక్కరికి కష్టాలు సుఖాలు ఇష్టాలు కోపాలు తాపాలు ఇలా ఎన్నో ఎదురౌతు ఉంటాయి... అన్ని రుచుల సమ్మేళనమే దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితం... విధాత శిల్పాన్ని చెక్కి మన తలరాతను మన  జన్మ ఖర్మ బట్టో లేదా ఆయనకు ఆ సమయంలో ఎలా అనిపిస్తుందో అది మన నుదుటిన రాసి అమ్మ కడుపులోకి పంపుతాడు...అలా మలచిన ఎన్నో అందమైన శిల్పాలతో ఈ ప్రపంచం నిండి పోయింది... కాకపోతే  జన్మకు కొన్ని మిగతా ఏ శిల్పాలకు ఇవ్వని అందమైన అనుబంధాలను తెలివితేటలను అందించాడు...కొన్ని బంధాలు దూరమైనా మనతోనే ఉండిపోయిన అనుభూతి ఎప్పటికి మిగిలిపోతుంది... అది ఏ బంధమైనా కావచ్చు...దేవుడు ఇన్ని అనుబంధాలను ఆప్యాయతలను మనకు కానుకగా ఇస్తే ఓ చిన్న మాటతో ఎన్నో అనుబంధాలను దూరం చేసుకుంటున్న ఈ తరాల అహాన్ని తప్పు పట్టాలో లేక వారి తెలివితేటలకు నా అన్న బంధాన్ని మాత్రమే  ఉంచుకుంటూ మన అన్న పదమే మర్చిపోతున్నందుకు బాధ పడాలో తెలియని స్థితి అటు పాత  కాకుండా ఇటు కొత్త తరము కాకుండా మధ్యలో ఉండి నలిగి పోతున్న ఎన్నో జీవితాలు చూస్తూ ఉరుకోవాలో... మనది మనకే అర్ధం కాని ఈ శిధిలమౌతున్న మానవ బంధాల శిధిలాలలో మనము ఓ శిధిల శిలల వ్యధల కధలు గానే మిగిలి పోవాలో....!!  ఈ తరాల అంతరాలుఅహాలు నశించి ఓ అందమైన అద్భుత ప్రపంచం చూడగలిగితే...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

ఎందరి జీవితాల్లోనో కొన్ని ఆశలు కలలు ఎప్పటికీ చేరని గమ్యాలుగానే మిగిలిపోతాయి
తరాల అంతరాలుఅహాలు నశించి ఓ అందమైన అద్భుత ప్రపంచం చూడలేకపోతే...!
చక్కని పోస్టింగ్
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ఏదో నాకు అనిపించింది రాశాను అది మీ అభిమానం ..ధన్యురాలిని

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner