21, జూన్ 2014, శనివారం

కారుమబ్బులు కమ్మినా......!!

ప్రతి చీకటి మేఘానికి స్వతహాగా 
వెండి వెలుగులు అంచులుగా
అద్దిన ఆ సృష్టికర్త....
రేయి పగలు ఒకదానికొకటి
ముడిపడిన చీకటి వెలుగుల
అందాలు చూడమని....
రాతిరి పరదాలు దాటుకుని
కాంతులు చిమ్మే పున్నమి వెన్నెల
పొద్దు పొడుపులో ఉషోదయాన్ని
సందెవేళ సింధూరపు వర్ణాన్ని అందించి
అందని జాబిలి మండే సూరీడు రెండు
మనకు దగ్గర కావని తెలిసినా
కారుమేఘాల చాటున దాగిన
మెరుపుల కాంతిని అడ్డుకోలేని
అసహాయత నేర్పిస్తుంది
అందమైన జీవిత సారాన్ని
అదే కష్ట నష్టాల సమతౌల్యాన్ని
ఆనంద విషాదాల విన్యాసాన్ని
చిక్కని చీకటి అంచుగా చేసుకున్న
వెండి వెలుగుల అంచుల ఆహార్యాన్ని
విజయ సోపానాలకు దారులుగా
గెలుపు బావుటా ఎగురవేయడానికి
ఒంటరి పయనానికి ఆసరాగా....!!
(Every dark cloud has its own silver lining)
ఈ మాటలకు అర్ధాన్ని ఎంత వరకు చెప్పగలిగానో పక్కని చిత్రాన్ని చూసి మీరే చెప్పాలి

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

అందని జాబిలి మండే సూరీడు .... దగ్గరలో లేకపోయినా .... ఆ కారుమేఘాలు అన్ని వైపుల్నుంచీ కమ్మేసినా .... ఆ కాంతిని అడ్డుకోలేని అసహాయత నుంచి నేర్చుకోవచ్చు
అందమైన జీవన సారాన్ని .... ఆ జీవితం లో ఎదురయ్యే ఆ కష్ట నష్టాల సమతౌల్యాన్ని ..... ఆనంద విషాదాల విన్యాసాల్ని

చాలా గొప్పగా కాచి వడబోచిన చక్కని జీవన సారం అక్షర రూపం లో
అభినందనలు మంజు గారు! శుభోదయం!!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ స్పందనకు ... చక్కని విశ్లేషణకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner