1, జులై 2014, మంగళవారం

నా అక్షరాలు.....!!

నా అక్షరాలు
నాతో స్నేహం చేసే నా నేస్తాలు
నా అక్షరాలు
నాలో నన్ను పంచుకునే బంధాలు
నా అక్షరాలు
నే దాచుకునే విలువైన జ్ఞాపకాలు
నా అక్షరాలు
నే పెంచుకునే అనుబంధాలకు సాక్ష్యాలు
నా అక్షరాలు
నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు
నా అక్షరాలు
నాతో ఆడుకునే అందమైన ఏకాంతాలు
నా అక్షరాలు
నాతోనే ఉండే విచిత్రపు ఒంటరి నక్షత్రాలు
నా అక్షరాలు
నన్ను దాయలేని దాపరికాల భావాలు
నా అక్షరాలు
నే మలచిన మనసు మౌన గానాలు
నా అక్షరాలు
నాకే సొంతమైన నా ఆనందాలకు నిలయాలు
నా అక్షరాలు
నా జీవిత గమనానికి రూపాలు
నా అక్షరాలు
అటు ఇటు వెరసి నేనే అని నాకు తెలిపిన దాఖలాలు...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

nmraobandi చెప్పారు...

చెప్పేశా ...
ఎంచక్కగా ఉందని ...

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

Chandra Vemula చెప్పారు...


నా చెలిమి నేస్తాలు
నా కష్టసుఖాలు పంచుకునే బంధాలు
నా అమూల్య జ్ఞాపకాలు
నా అనుబంధాల సాక్ష్యాలు
నా అంతర్నేత్రాలు
నా అందమైన ఏకాంతాలు
నా దాయలేని దాపరికాల భావాలు
నా మనసు మౌన గానాలు
నా ఆనందాల నిలయాలు
నా జీవన గమన రూపాలు
నా అక్షరాలు
అటు ఇటు వెరసి నేనే అని నాకు తెలిపిన దాఖలాలు...!!
ప్రతి భావుకుడి భావనలను మీ మాటగా చక్కగా అభివర్ణించారు
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner