18, జులై 2014, శుక్రవారం

మాయా ప్రపంచం...!!

కోపమెందుకో చర చరా వచ్చేస్తోంది
క్షణంలో పోయే ఈ ప్రాణానికి
అంత అహంకారమెందుకో మరి...!!
ఎంత దగ్గరగా ఉన్నా దురాన్ని
పెంచుతూ ఒంటరిని చేస్తూ
ఏకాంతానికి కూడా దూరంగా....!!
అందరిని దూరం చేసి తను మాత్రం
ఉండి పోదామని చూస్తోంది
పక్కపక్కనే తిరుగుతు ప్రయాస పడుతూ...!!
మనసేమో మాట విననంటోంది
కోపమేమో వెళ్ళలేనంటోంది
మధ్యన నలిగి పోతోంది ఈ జీవితం...!!
చుట్టరికాల సూటిపోట్లు తప్పని
మమకారపు బంధాల అగచాట్లు
మరో లోకం చూడనివ్వని మాయా ప్రపంచం...!!
రగులుతున్న రోషావేశాలు
నాలోని మనిషిని దహిస్తున్న
మారణకాండకు సంకేతాలుగా మిగిలిపోయాయి...!!
ఎవ్వరికి చెందని ఏకాకిలా
అందరున్నా ఎవరులేని రాలేని
నా ఒంటరి పయనానికి సాక్షీభూతంగా నిలిచి పోయాను...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

చాలా బాగుంది .
నాలోని మనిషిని దహిస్తున్న
కంటే
నాలోని మనసుని దహిస్తున్న
అంటే బాగుండేదేమో .......

టైటిలే " మాయాప్రపంచం " కంటే " సాక్షి " అంటే బాగుంటుందేమో అనిపించింది .

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శర్మ గారు మీ సలహాలకి ఏమో అక్కడ నాకు మనసు అని రాయాలి అనిపించలేదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner