17, జులై 2014, గురువారం

కాలం గాయపడింది...!!

కాలం గాయపడింది నాతో పాటుగా
చెరగని గుర్తులు మిగిల్చి పోయింది
బతుకు మీద ఆశను చంపేస్తూ
చితిని పేర్చుతున్న జ్ఞాపకాలను
కాలనీయని మంటలను చూస్తూ
వదలి వెళ్ళలేక ఉండిపోయిన
కనపడని మనసు మౌన రోదన
ఎక్కడో వినిపిస్తోంది దూరంగా
ఏమి చేయలేని నిస్సహాయస్థితి
బిగ్గరగా నవ్వుతోంది నన్ను చూసి
ఎటూ పోలేని నా అస్సహాయత
నాతోపాటుగా ఆగి పోయింది
నన్ను వదలి వెళ్ళలేక ఉండలేక
నేను ఉండి పోయాను అందుకేనేమో...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Meraj Fathima చెప్పారు...

కాలం గాయాలనే మిగులుస్తుంది, ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది.
మంజూ ఎలా ఉన్నావమ్మా.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే అక్కా మీరు ఎలా ఉన్నారు చాలా రోజులు ఐంది

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner