16, ఆగస్టు 2014, శనివారం

ఏమిటో మరి ఈ వింత...!!

గరళం గొంతులోనే ఉండిపోయింది
ఎటు  వెళ్ళాలో తెలియక
ఇముడ్చుకోలేని విషాన్ని భరించడం
ఆ నీలకంఠధారునికే ఎరుక
లెక్కలేసుకుంటున్న క్షణాలలో దగ్గరగా
వచ్చిన నీలో అంతర్ముఖంగా
నన్ను నేను చూసుకుంటున్నా ఎందుకో
ఆపలేని కాలాన్ని అంతర్లీనమైన భావుకతతో
పోల్చుతూ ఈ చర్మపు తిత్తిలో మిగిలిన
మనసు ఎగిరిపోయే నిమిషం తెలిసినా
మరో ప్రపంచానికి స్వాగతం పలికే
మరుజన్మకు నాందిగా ఆనందాన్ని
చవి చూడాలన్న అంతర్లోచనాన్ని
నాకు మాత్రమే వినిపిస్తున్న సాగర మధనం
అద్భుతంగా అనిపిస్తోంది ఏమిటో మరి ఈ వింత...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

భావాలు బాగుంటున్నాయి . కొంచెం ఎడం అప్పుడప్పుడైనా అవసరం . అర్ధం చేసుకొని లైన్ల వరుసను మారిస్తే యింకా బాగుంటాయి మీ కవితలు .

Meraj Fathima చెప్పారు...

bhaavaalu chaalaa baagunnaayi,
manchi saili mee sontam

చెప్పాలంటే...... చెప్పారు...

ఇరువురికి ధన్యవాదాలు మీ సూచనలు తప్పక పాటిస్తాను అండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner