24, ఆగస్టు 2014, ఆదివారం

శూన్యాన్ని చుట్టేద్దామని...!!

శూన్యాన్ని చుట్టేద్దామని రోజు నా ప్రయత్నమే
ఎక్కడ మొదలు పెట్టాలా అనుకుంటూ మొదలు
వెదికే వెతుకులాటలోఆది అంతాల కోసం పోరాటమే
అయినా ఆగని ఆలుపులేని ఈ పరుగు పందెంలో
ఓడిపోవడానికి ఇష్టపడని నా అంతరంగం తనలోని
కలల నిజాల కోసం తపన పడుతూ నిరంతరం సాగుతూనే
అందని గమ్యాన్ని అందుకోవాలని ఆరాటపడుతూ
అడ్డు తగిలే ఆలశ్యాలను అధిగమిస్తూ పోతూనే ఉన్నా
ఎప్పటికైనా ఏమి లేని శూన్యాన్ని చుట్టేసి పక్కనే
దాగిపోయిన జలతారు వెలుగు అందిపుచ్చుకోవాలని
విశ్వమంతా ఆ వెన్నెల కాంతిలో మెరవాలని
సంతోషపు చిరు జల్లులు సాదరంగా స్వాగతం పలకాలని
నిరాశల నిటూర్పులు వినిపించని కొత్త ప్రపంచాన్ని అందరికి
పరిచయం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తున్నా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...

ఎన్ని జన్మలెత్తుతున్నా అది అంతు తెలియనిది ఈ మానవునికి , ఈ మన ఉనికికి .

ఈ శూన్యాన్ని చుట్టేద్దామని చిన్నతనం నుంచే ఆరంభమని చిన్న పిల్లవాడి ఫొటొ పెట్టటం , అందునా అంతులేని అంబుధి ముంగిట కూర్చోవటం చాలా చాలా బాగుంది .

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మీ స్పందనకు శర్మ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner