12, నవంబర్ 2014, బుధవారం

రాలిపోతున్న చిన్నతనం....!!

అమ్మానాన్నల ప్రేమ  తెలియని నా అన్న వాళ్ళు
కనిపించని ఈ విశాల ప్రపంచంలో ఉంటూ
ఆటలు పాటలు ఎరుగని అంధకారంలో మగ్గుతూ
రాళ్ళు రప్పల పాలై ఆవిరౌతున్న చిన్నతనం
పాలుగారే పసి బుగ్గల పసిడి బాల్యం
మూటల బరువుకు చతికిల పడి లేవలేక
ఆకలి కేకలు అరణ్య రోదనలై కన్నీటితో
కడుపు నింపుకుంటున్న జీవాలు కోకొల్లలు
ఆకలి రక్కసి కోరల్లో చిక్కినా అన్యాయానికి బలైనా
ఆత్మీయత కోసం అలమటించే బడి బాట పట్టని
పలకాబలపం తెలియని బడుగు జీవులు
దైవానికి నేస్తాలైనా దయలేని దానవులు
చిన్న చూపు చూస్తున్నా జానెడు పొట్ట కోసం
పిడికెడు మెతుకుల ఆరాటానికి బండెడు చాకిరీకి
భయపడని చిన్నారుల చేతుల్లో బలానికి
వారి జీవిత పోరాట నైపుణ్యానికి జోహార్లు....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

sivasankarmahanthi చెప్పారు...

పాలుగారే పసి బుగ్గల పసిడి బాల్యం
మూటల బరువుకు చతికిల పడి లేవలేక
ఆకలి కేకలు అరణ్య రోదనలై కన్నీటితో
కడుపు నింపుకుంటున్న జీవాలు కోకొల్లలు
ఆకలి రక్కసి కోరల్లో చిక్కినా అన్యాయానికి బలైనా
ఆత్మీయత కోసం అలమటించే బడి బాట పట్టని
పలకాబలపం తెలియని బడుగు జీవులు

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner