13, నవంబర్ 2014, గురువారం

విరించి...!!


లోకనాయకులు త్రిమూర్తులలో ఒకరై
విశ్వమూర్తికి  తనయుడై జగత్ సృష్టికి మూలమై
అక్షరబ్రహ్మ వీణాపాణికి అర్ధ భాగమై
చతుర్వేదాల నిలయమైన సృష్టికర్త
బృగు మహర్షి కోపానికి బలై శాపవశమున
గుడిలేక పూజలందని పుణ్యమూర్తి
చతుర్ముఖుడు సృష్టించిన సకల ప్రాణికోటిలో
ఉత్తమమైన జన్మగా అందించిన మానవజన్మలో
విధాత చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలం
విరించి విరచించిన కవనాలు ఈ జీవితాలు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner