28, నవంబర్ 2014, శుక్రవారం

మనఃపూర్వక కృతజ్ఞతలు.... !!

నేస్తం...
   అక్షరాల వారధిగా నీతో పంచుకుని పెంచుకున్న అనుబంధం అలా అలా పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎంత బావుందో... నాకు బాధ వేసినా.. సంతోషం వచ్చినా ముందుగా నీతోనే పంచుకోవాలి అనిపించేంత దగ్గరగా వచ్చేశావు ఈ కాస్త పరిచయంలోనే... గత జన్మ బంధం అంటే ఇదే కాబోలు... ఎందుకో అక్షరాలలోనే సంతోషాన్ని, విషాదాన్ని చూడటం పరిపాటిగా మారిపోయింది... జగమంత కుటుంబం నాదయినా నా ఏకాంతానికి నీ స్నేహమే ఆలంబనగా చేరింది... అమ్మలా అక్కున చేర్చుకున్నా... నాన్నలా ప్రేమాభిమానాలు పంచినా... ఆత్మీయ బంధంలా దగ్గరకు తీసినా ఇలా అన్ని బంధాలు నీలోనే వెల్లువలా పొంగితే వాటికి దాసోహం అనక తప్పలేదు.... నా ప్రతి మనసు స్పందన ముందుగా వినిపించింది నీకే...అందుకేనేమో ఇంతగా మమేకమైపోయావు నాలో నువ్వుగా... ఎన్నెన్ని జ్ఞాపకాలు, మరెన్నో ముచ్చట్లు, మనసు మాటలు, ఆరళ్ళ అగచాట్లు... ఇలా ఒకటేమిటి అన్ని... నీకు చెప్పని కబురు నా దగ్గర ఏం ఉంది కనుక.... ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అన్ని నీకే చెప్పేస్తూ ఉంటానా అని... సమాధానం దొరకకుండా పోయింది... అందరు అనుకుంటూ ఉంటారు స్తబ్దుగా ఉంది అని కాని వాళ్ళకు తెలియదు కదా నేను నీతో అన్ని చెప్పేస్తున్నా అని... మన పరిచయం మొదలై ఐదు వసంతాలు పూర్తి కావస్తున్నా తొమ్మిది వందల కబుర్ల సమీకరణాలు పంచుకున్నామని ఎంత మందికి తెలుసంటావు...?? ఇలా ఎన్నాళ్ళో  ఈ అనుబంధం... నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే సాగనీ నేస్తమా.... నా ఈ తొమ్మిది వందల టపాలను ఓపికగా భరించి నాతో స్నేహాన్ని మరింత పెంచేసుకున్న నా నీకు కృతజ్ఞతలు.... -:) .

ఏంటి అర్ధం కాలేదా నా బ్లాగులో ఇది తొమ్మిది వందల పోస్ట్ .... మరి అందరు ఇంకా చూస్తున్నారేంటి అభినందించేయండి ..... నన్ను నా పోస్టులను భరిస్తున్న బ్లాగు మిత్రులకు.... ముఖ పుస్తక నేస్తాలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు....
మీ నేస్తం...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner